రామోజీరావు సంస్మరణ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు( Ramojirao ) సంస్మరణ సభని వైభవంగా నిర్వహించింది.ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు,( CM Chandrababu ) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లతో( Deputy CM Pawan Kalyan ) పాటు పలువురు మంత్రులు రామోజీరావు కుటుంబ సభ్యులు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల హాజరయ్యారు.

 Deputy Cm Pawan Kalyan Key Remarks At Ramoji Rao Memorial Service Details, Deput-TeluguStop.com

విజయవాడలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామోజీరావు ప్రస్థానం ఛాయాచిత్రాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.రామోజీరావు కుటుంబ సభ్యులు ప్రత్యేక బస్సులో రాగా వారికి ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి స్వాగతం పలికారు.

ఏపీ మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, సత్య కుమార్ హాజరయ్యారు.

ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంస్మరణ సభలో సంచలన స్పీచ్ ఇచ్చారు.ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు వారసత్వాన్ని ప్రతి జర్నలిస్టూ అందుపుచ్చుకోవాలని సూచించారు.పార్టీలకతీతంగా మంచి పనులు చేస్తే ప్రశంసించేవారు.

అదేవిధంగా ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే అదే రకంగా ఎండగట్టేవారు.ప్రభుత్వం ఏం చేసినా ప్రజలకు తెలియాలని పత్రికారంగంలో రామోజీ ఓ యజ్ఞం చేశారు.

ఆయన మాటల్లో జర్నలిజం( Journalism ) విలువలే కనిపించేవని చెప్పారు.విజయవాడలోని కానూరులో రామోజీ సంస్మరణ సభలో పవన్ మాట్లాడారు.

రాజకీయాల్లోకి వచ్చాక 2008లో ఆయనను తొలిసారి కలిసినట్లు చెప్పారు.జనం కోసం రామోజీ నిష్పాక్షికంగా ఉండేవారన్నారు.

ప్రజాసమస్యల పరిష్కారానికి ఎనలేని పోరాటం చేశారని పవన్ కళ్యాణ్ కొనియాడారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube