నందమూరి మూడోవ తరం హీరోగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) ప్రస్తుతం తనదైన రీతిలో వరుస సినిమాలను చేసుకుంటు ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాలు కూడా అతనికి మంచి విజయాన్ని అందిస్తూ వస్తున్నాయి.
ఇక వరుసగా ఇప్పటికీ ఆరు సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్న ఆయన ఇప్పుడు ‘దేవర ‘ సినిమాతో( Devara ) మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ని కూడా ప్రేక్షకులు సక్సెస్ చేసి చూపిస్తున్నారు.అయితే రీసెంట్ గా అనిరుద్( Anirudh ) మ్యూజిక్ లో వచ్చిన ఒక సాంగ్ ప్రేక్షకుల్ని ఎంత మేరకు ఆకట్టుకోలేదు.ఎందుకంటే అనిరుద్ మ్యూజిక్ లో మ్యూజిక్ మాత్రమే వినిపిస్తుంది.
కానీ లిరిక్స్( Lyrics ) మాత్రమే అర్థం కావడం లేదు అంటూ చాలామంది అభిమానులు ఆ సాంగ్ మీద వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఇక సెప్టెంబర్ 27 వ తేదీన సినిమా రిలీజ్ అవుతున్నా నేపథ్యం లో ఈ సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.
మరి దానికి తగ్గట్టుగా ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక సాంగ్స్ విషయంలోనే అనిరుధ్ మ్యూజిక్ దగ్గర కొంచెం డల్ అయినట్టుగా కనిపిస్తుంది.మరి బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు అనేది ఈ సినిమాని సక్సెస్ తీరానికి చేర్చడం లో ఆయన మ్యూజిక్ సినిమాకి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి… ఇక ఇప్పటికే ఆయన మ్యూజిక్ ఇచ్చిన తెలుగు సినిమా అయిన ‘అజ్ఞాతవాసి’ సినిమా( Agnathavasi ) భారీ డిజాస్టర్ అయింది.మరి ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మారితే మాత్రం ఆయన మీద ఇండస్ట్రీ లో ఉన్న కొందరు ఐరన్ లెగ్ అనే ముద్ర వేస్తారు.