మేడమ్‌ను "సార్" అనేసింది.. అంతే యూఎస్ ఫ్లైట్ నుంచి గెంటేశారు..??

టెక్సాస్‌( Texas )కు చెందిన జెన్నా లాంగోరియా( Jenna Longoria ) అనే మహిళకు ఓ యూఎస్ ఫ్లైట్‌లో చేదు అనుభవం ఎదురయింది.తాను బుధవారం ఒక యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం నుంచి అయిష్టంగానే దిగిపోవాల్సి వచ్చిందని ఆమె చెబుతోంది.

 Us Woman Removed From Flight For Misgendering Crew Member, Jenna Longoria, Texas-TeluguStop.com

ఒక విమానయాన ఉద్యోగినితో మాట్లాడేటప్పుడు తాను ఆమెను సార్ అని తప్పుగా పిలిచానని ఆమె వెల్లడించింది.లాంగోరియా, తన తల్లి, 16 నెలల కొడుకుతో కలిసి శాన్ ఫ్రాన్సిస్కో( San Francisco ) నుంచి ఆస్టిన్‌కు ప్రయాణిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.

విమానంలోకి ఎక్కుతున్నప్పుడు, ఒక ఫ్లైట్ స్టాఫ్ మెంబర్‌ను సంబోధిస్తూ తాను తప్పుగా సర్వనామం వాడినట్లు ఆమె అంగీకరించింది.తన తప్పుకు క్షమాపణ చెప్పినప్పటికీ, విమానయాన సిబ్బంది తనని విమానం నుంచి దిగిపోమని ఆదేశించారని లాంగోరియా తెలిపింది.

విమానంలోకి ఎక్కుతున్నప్పుడు, ఒక మహిళ ఉద్యోగినిని “సర్” అని పిలిచా.ఆమె చాలా కోప్పడింది.నేను విమానం దగ్గరకు వెళ్లి, లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాను.అప్పుడు ఆమె నా తల్లిని వెనక్కి నెట్టి, నాతో పాటు రాకుండా ఆపేసింది,” అని లాంగోరియా చెప్పింది.

ఈ సంఘటన తనకు చాలా బాధ కలిగించిందని, తనను అవమానించారని లాంగోరియా ఆరోపించింది.ఈ సంఘటనపై యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఇంకా స్పందించలేదు.

విమానంలోకి ఎక్కిన తర్వాత, లాంగోరియా( Jenna Longoria ) మరొక మగ ఫ్లైట్ అటెండెంట్ ను హెల్ప్ అడిగింది.మొదటి ఉద్యోగి తన తల్లిని, తన కొడుకును గేటు వద్ద నిలిపివేశారని ఆమె చెప్పింది.ఆ సమయంలో “అతను” అంటూ చెప్పుకొచ్చింది.“అతను ఏమిటి ‘అతను’ అని మరో ఉద్యోగి అడిగాడు, నేను ‘అవును’ అని చెప్పాను.ఆ తర్వాత ‘ఆమె డ్రెస్ ధరించింది‘ అని అన్నాడు,” అని లాంగోరియా చెప్పింది”నా కొడుకు ఏడుస్తున్నాడు.నేను విమానంలోకి ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాను,” అని ఆమె గుర్తు చేసుకుంది.“ఒక తల్లిగా, నా ప్రాధాన్యత నా కొడుకును సురక్షితంగా విమానంలోకి ఎక్కించడం, ఎవరిని ఏ సర్వనామాలతో నేను ఎక్కువగా దృష్టి పెట్టం.” అని ఆమె చెప్పుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube