కస్టడీలో ఉన్నా మేకప్.. పవిత్ర గౌడ బిహేవియర్ ను నెటిజన్లు ఛీ కొడుతున్నారుగా!

రేణుకాస్వామి( Renukaswamy ) హత్య కేసులొ ఏ1గా పవిత్రా గౌడ( Pavithra Gowda ) ఉండగా ఏ2గా దర్శన్( Darshan ) ఉన్న సంగతి తెలిసిందే.పవిత్రా గౌడ ప్రవర్తన పోలీసులను సైతం ఆశ్చర్యపరిచేలా ఉందని సమాచారం అందుతోంది.

 Netizens Comments About Pavitra Gouda Behavior Details, Pavithra Gowda, Pavithra-TeluguStop.com

కస్టడీలో సైతం పవిత్ర గౌడ మేకప్ వేసుకుని లిప్ స్టిక్ రాసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ కావడం గమనార్హం.ఈ ఫోటోలకు సంబంధించి దుమారం రేగడంతో పోలీసులు చర్యలు చేపట్టారని సమాచారం అందుతోంది.

హత్య విషయంలో పవిత్రలో పశ్చాత్తాపం అణువంతైనా కనిపించడం లేదని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.పవిత్రా గౌడ మేకప్( Pavithra Gowda Makeup ) విషయంలో ఒక ఎస్సైకు సైతం నోటీసులు జారీ అయ్యాయని సమాచారం అందుతోంది.

పవిత్రా గౌడ విషయంలో ఎస్సై నిర్లక్ష్యంగా వ్యవహరించారని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.మరోవైపు పవిత్ర గౌడ గొంతెమ్మ కోరికలు కోరారని వార్తలు వినిపించాయి.

Telugu Darshan, Pavithra Gowda, Pavithragowda, Renukaswamy-Movie

పవిత్ర గౌడను తాజాగా తల్లి, కూతురు కలిశారని ఆ సమయంలో పవిత్ర గౌడ కన్నీళ్లు పెట్టుకున్నారని తెలుస్తోంది.రేణుకాస్వామిని దర్శన్ హత్య చేయించడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా పవిత్ర గౌడ కారణమని సమాచారం అందుతోంది.రేణుకా స్వామి పవిత్ర గౌడ గురించి అభ్యంతరకరంగా పోస్టులు పెట్టడంతో దర్శన్ రేణుకాస్వామి హత్యకు ప్లాన్ చేయడం జరిగింది.

Telugu Darshan, Pavithra Gowda, Pavithragowda, Renukaswamy-Movie

హత్యకు ముందు రేణుకాస్వామిని ఎంతో ఇబ్బంది పెట్టారని పోస్టుమార్టం రిపోర్ట్ లో వెల్లడైన సంగతి తెలిసిందే.ఈ కేసుకు సంబంధించి రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.ఈ కేసు వల్ల దర్శన్ భవిష్యత్తుకు సైతం ఇబ్బందులు తప్పవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పవిత్రా గౌడ, దర్శన్ లకు కఠిన శిక్షలు పడే అవకాశాలు అయితే ఉన్నాయని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.దర్శన్ కు కఠిన శిక్షలు పడితే బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube