చికెన్ అంటే చాలా మందికి ఇష్టం.ఎంతో ఇష్టపడి తింటారు.
రిజనబుల్ ధరలోనే అందుబాటులో ఉండటంతో కనీసం వారానికి ఒక్కసారైనా తింటారు.కొంతమంది అయితే, ముక్క లేనిదే ముద్ద దిగదు అన్నట్లు రోజూ తినేవారు కూడా ఉన్నారు.
అయితే, చికెన్ ప్రియులకు ఈ వార్త ఓ బ్యాడ్ న్యూస్! ఎందుకంటే దీన్ని ఎక్కువ మోతాదులో తినడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయట.ఆ వివరాలు తెలుసుకుందాం.
సాధారణంగా చికెన్ తింటేనే మన బాడీలో ప్రోటిన్స్ లెవల్ పెరుగుతాయి.ఈ ప్రోటిన్స్ వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది కానీ, అందులో కేవలం నాటుకోళ్లు తింటేనే ఆరోగ్యానికి మంచి చేస్తాయి.
ఫారం కోళ్లను తింటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు! వారానికి రెండు మూడు సార్లు చికెన్ తింటే ఫర్వాలేదు కానీ, వారంలో 4–5 లేదా అంతకంటే ఎక్కువ సార్లు తింటే అటువంటి వారికి ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు తప్పవు.
అందులోనూ ప్యాకెట్లలో లభించే ప్రాసెస్డ్ చికెన్ కంటే మనం తెచ్చుకుని వండుకోవడం మేలు.అందులో ఇ, ఆ విటమిన్లు ఉంటాయి.ఫొలేట్, సెలెనియం, కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం ఉంటాయి.
అయితే చికెన్ కంటే చేపలు, తాజా పండ్లు, కూరగాయలు తినడం ఎంతో మంచిదంటున్నారు నిపుణులు.కానీ ఏ మాంసమైనా రోజుకు 170 గ్రాములకు మించి తినకూడదని అంటున్నారు.
అంతకంటే ఎక్కువ తింటే, ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, ఇంకా క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.దీనికి ప్రధాన కారణం చికెన్ పై సాల్మొనెల్లా, క్యాంపీలోబాక్టెర్ బ్యాక్టీరియా ఉంటాయి.
అందుకే దీన్ని తీసుకువచ్చిన రెండు మూడు గంటల్లో వండుకోవాలి.అలా కాకుండా ఫ్రిజ్‌లో పెట్టి కొద్దికొద్దిగా వండుకుంటూ ఉంటే ఈలోగా ఈ బ్యాక్టీరియా పెరిగి పాయిజనింగ్ అవుతుంది.
డాక్టర్లు ఈ–కోలి బ్యాక్టీరియా చికెన్ పై ఉంటుందని తేల్చారు.అన్ని చికెన్ల పైనా ఉండదు.
ఇది కేవలం నిల్వ ఉన్న చికెన్ పైన ఉంటుంది.ఇది డయేరియా, నిమోనియా, ఊపిరి ఆడని సమస్యలకు కూడా దారితీస్తుంది.
కోళ్లఫారంలలో కోళ్లు తినే ఆహారం మొక్క జొన్న.దీంతో ఆ కోళ్లకు కొవ్వు పట్టేస్తుంది.
ఆ చికెన్ మనం తింటే మనకూ ఆ-కొలెస్ట్రాల్ పట్టుకుంటుంది.కొంతమంది చికెన్ ఎక్కువ తిన్నా.
వారు వర్కౌవుట్స్ చేస్తారు.కాబట్టి వారికి కొవ్వు పట్టదు.
చికెన్ ఎప్పుడు తిన్నా కేవలం కూరలా చేసుకొని తింటే మంచిది.ఫ్రై చేసుకుని తినకూడదు.
ఎందుకంటే, అది శరీరంలోకి వెళ్లి క్యాన్సర్ సోకేందుకు కారణం అవుతుందని పరిశోధనలు తేల్చాయి.ఎప్పుడో ఓసారి ఫ్రై తింటే ఓకే.కానీ, తరచూ తింటే ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు.