ఆ రివ్యూవర్ ను బండ బూతులు తిడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్.. రివ్యూలు ఇవ్వడం వచ్చా అంటూ?

స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) సినిమాలకు నెగిటివ్ రివ్యూలు ఇచ్చే విషయంలో ఉమైర్ సంధు( Umair Sandhu ) ముందువరసలో ఉంటారు.ప్రభాస్ సినిమాలకు ఉమైర్ సంధు నెగిటివ్ రివ్యూలు ఇచ్చిన సమయంలో ఒకటి రెండుసార్లు నిజం కావడం ఆయన పదేపదే నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం గమనార్హం.

 Prabhas Fans Fire On Critic Umair Sandhu Details, Umair Sandhu, Prabhas, Prabhas-TeluguStop.com

విచిత్రం ఏంటంటే కల్కి సినిమాకు( Kalki Movie ) కూడా ఉమైర్ సంధు నెగిటివ్ రివ్యూ ఇచ్చారు.ఈ రివ్యూ నిజం కాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఉమైర్ సంధును బండ బూతులు తిడుతున్నారు.

కల్కి స్టైల్ విషయంలో హైలో ఉందని సబ్ స్టెన్స్ విషయంలో తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.సినిమాలో ఎంటర్టైన్మెంట్ లేదని ఉమైర్ సంధు చెప్పుకొచ్చారు.కల్కి మూవీ ప్రేక్షకులను నిరుత్సాహానికి గురి చేసిందని ప్రభాస్, దీపికలకు బ్యాడ్ లక్ అని డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పవని ఆయన చెప్పుకొచ్చారు.అయితే సినిమా మాత్రం యునానిమస్ పాజిటివ్ టాక్ తో అదరగొడుతోంది.

కల్కి 2898 సినిమా హక్కులను భారీ స్థాయిలో కొనుగోలు చేసిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా భారీ లాభాలను అందిస్తోంది.ఫస్ట్ వీకెండ్ సమయానికే ఈ సినిమా చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.కల్కి 2898 ఏడీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో సంచలనం అని చెప్పవచ్చు.ఈ జనరేషన్ ఆడియన్స్ అభిరుచికి అనుగుణంగా ఈ సినిమా తెరకెక్కింది.

కల్కి 2898 ఏడీ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కు ( Prabhas Fans ) ఎంతో సంతోషాన్ని కలిగించింది.కల్కి 2898 ఏడీ భారీ బడ్జెట్ కు న్యాయం చేసిందనే చెప్పాలి.నాగ్ అశ్విన్ వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ సాధించడం గమనార్హం.నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో నటించడానికి టాలీవుడ్ స్టార్స్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.నాగ్ అశ్విన్ రాబోయే రోజుల్లో మరి కొందరు స్టార్స్ తో సినిమాలు చేస్తారేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube