అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే?

హిందూ సాంప్రదాయంలో ప్రతిరోజు ఏదో ఒకటి విశేషమైనదే.ప్రతి ఒక్క పండుగను జరుపుకుంటారు.

 No Need To Buy Gold Onakshaya Tritiya Da Because, Akshaya Tritiya , Devotional,-TeluguStop.com

అయితే కొన్ని పండుగలు మాత్రం సెంటిమెంట్స్ చుట్టూ ఉంటాయి.అలాంటి పండుగలోనే అక్షయ తృతీయ( Akshaya Tritiya ) కూడా ఒకటి.

ఇది వైశాఖ మాసంలో మూడో రోజు అంటే వైశాఖ శుద్ధ తదియ రోజున ఉంటుంది.అక్షయం అంటే నాశనం లేనిది, తరగనిది అని అర్థం.

అందుకే ఈరోజు కచ్చితంగా దానధర్మాలు, పుణ్యం అత్యధిక ఫలితాలనిస్తాయని చెబుతారు.అందుకే ఈరోజు దానధర్మాలు చేస్తే అక్షయమైనట్టే.

చిన్న పాపమైన అది అక్షయమవుతుందని నమ్ముతారు.ఇక అక్షయ తృతీయ రోజు మొత్తాన్ని ఒక మంచి ముహూర్తంగా భావిస్తారు.

ఈరోజున దుర్ముహూర్తాలు, వర్జియాలు, యమగండం లాంటివి పెద్దగా ప్రభావం చూపవని చెబుతారు.ఈ రోజున మొత్తం ఏ క్షణం ఏం చేసినా శుభ ఫలితాలే ఉంటాయని నమ్ముతారు.

అసలు ఈ రోజుకున్న ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే ఈరోజున త్రేతా యుగం మొదలైంది.అలాగే పరుశురాముడు ఈరోజున జన్మించారు.

అయితే అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా బంగారం కొనాలని చాలామంది ప్రచారం చేస్తుంటారు.ఎందుకంటే ఆ రోజున బంగారం కొంటే లక్ష్మీదేవి( Lakshmi Devi ) ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని నమ్ముతారు.

దీన్నే అదునుగా తీసుకొని బంగారం షాపుల వాళ్లు కూడా మగువలను ఆకర్షించేందుకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తుంటారు.అలాగే అక్షయ తృతీయ రోజు కూడా మనం చూసినట్లయితే పసిడి షాపులన్నీ నిండిపోయి ఉంటాయి.

మరికొందరేమో అక్షయ తృతీయ రోజు కచ్చితంగా బంగారం కొనాల్సిందే అని అప్పు చేసి మరీ బంగారం కొంటూ ఉంటారు.

Telugu Akshaya Tritiya, Devotional, Gold, Hindu, Lakshmi Devi-Latest News - Telu

కానీ అందరికీ తెలియని విషయం ఏంటి అంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం అవసరం లేదు.ఎందుకంటే కలిపురుషుడి 5 నివాస స్థానాల్లో బంగారం ఒకటి.బంగారం అహంకారానికి హేతువు.

అంటే కోరి కలిపురుషుడినీ ఇంట్లో పెట్టుకుంటున్నారని అర్థం.అలాగే అహంకారాన్ని మరింత పెంచుకుంటున్నారని అర్థం.

అయితే అక్షయ తృతీయ రోజు బంగారం( Gold ) కొనాలని కాదు దానం చేయమని వేద పండితులు చెబుతున్నారు.ఈరోజు బంగారం కొనుగోలు చేయడం కన్నా దానం చేస్తే ఉత్తమం.

ఇక బంగారం దానం చేసే స్తోమత లేని వాళ్ళు ఏదో ఒకటి దానం చేసిన పుణ్యం అక్షయమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube