అల్లు అర్హకు సొంత వ్యక్తిత్వం ఉంది... అల్లు అర్జున్ జోక్యం చేసుకోరు: సమంత

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత(Samantha) ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా (Shaakuntalam Movie) ఏప్రిల్ 14వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

 Allu Arha Has His Own Personality Allu Arjun Doesnt Interfere Samantha, Samantha-TeluguStop.com

గుణశేఖర్(Gunasekhar) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరికెక్కిన ఈ సినిమా నీలిమ గుణ దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో భరతుడి పాత్రలో నటుడు అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ (Allu Arha)నటించిన విషయం మనకు తెలిసిందే.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సమంత అల్లు అర్హ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.అల్లు అర్హ కెరియర్ విషయంలో అల్లు అర్జున్(Allu Arjun) ప్రమేయం గురించి సమంత చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా అల్లు అర్హ గురించి సమంత మాట్లాడుతూ…అల్లు అర్హకు సొంత వ్యక్తిత్వం ఉంది తన కెరీర్ ఎలా ఉండాలో తాను సొంతంగా నిర్ణయం తీసుకోగల కెపాసిటీ తనకు ఉందని తను చాలా టాలెంట్ అని సమంత తెలియజేశారు.అర్హ పెద్దపెద్ద డైలాగ్స్ కూడా చాలా ఈజీగా చెప్పేస్తోంది.

తన పాత్రకు పిల్లలందరూ చాలా కనెక్ట్ అవుతారని సమంత తెలియజేశారు.

ఇలా అల్లు అర్హ విషయంలో అల్లు అర్జున్ జోక్యం ఏమాత్రం ఉండదనీ తాను అనుకుంటున్నట్లు ఈ సందర్భంగా సమంత చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.మరి అల్లు అర్హ ఫస్ట్ సినిమా ద్వారా ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటుందో తెలియాల్సి ఉంది.ప్రముఖ కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత శకుంతల పాత్రలో నటించగా దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి ఆదరణ పొందుతుందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube