నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లి సముద్రతీరంలో ఉద్రిక్తత నెలకొంది.తమిళనాడు కడలూరుకు చెందిన బోట్లు ఏపీ తీరంలోకి చొచ్చుకువచ్చాయి.
ఈ క్రమంలో కడలూరు బోటు తగిలి ఇసుకపల్లి మత్స్యకారుల వలలు తెగిపోయాయి.ఇదేమిటని ప్రశ్నించిన ఇసుకపల్లి జాలర్లపై తమిళనాడు జాలర్లు రాళ్లతో దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.
దీంతో సముద్రతీరంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.







