ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 11వ నెల రెండు రోజుల్లో ప్రారంభం కానుంది.ఈ నవంబర్ నెల ఉపవాసాలకు, పండగలకు ఎంతో ముఖ్యమైనది.
నవంబర్ నెలలో కార్వా చౌత్ ధన్తేరస్, ఛత్ దీపావళి అనేక ప్రధాన పండుగలు జరుపుకుంటారు.హిందూ పంచాంగం ప్రకారం నవంబర్ నెలలో కార్తీక మాసం మొదలవుతుంది.
ఈ రోజున సంక్షేమ చతుర్థి కర్వా చౌత్( Karva Chauth ) జరుపుకుంటారు.కాబట్టి నవంబర్ నెలలో ఏ ప్రధాన పండుగలు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే నవంబర్ 1వ తేదీన కార్వా చౌత్ వ్రతం జరుపుకుంటారు.ముఖ్యంగా చెప్పాలంటే వివాహం చేసుకున్నా మహిళలు తమ భర్తల దీర్ఘాయువు, కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు కోసం ఉపవాసం ఉంటారు.

అంతే కాకుండా నవంబర్ 9వ తేదీన రామ ఏకాదశి ( Rama Ekadashi )జరుపుకుంటారు.ఈ రోజున ప్రజలు విష్ణువు అనుగ్రహంతో పాటు తల్లి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందెందుకు రామ ఏకాదశి ఉపవాసాన్ని పాటిస్తారు.అలాగే నవంబర్ 10వ తేదీన ధన్వంతరి జయంతిని జరుపుకుంటారు.ఈ రోజున దేవతల వైద్యడు అని పిలువబడే ధన్వంతరిని పూజించాలని చెబుతారు.దీనితో పాటు సంపద దేవత ఆయన లక్ష్మి( Goddess Lakshmi )ని కూడా ఈ రోజున పూజిస్తూ ఉంటారు.అలాగే నవంబర్ 11వ తేదీన నకరా చతుర్దశిని జరుపుకుంటారు.
ఈ రోజును నకరా చతుర్దశి యమునికి అంకితం చేయబడింది.ఈ రోజును ఛోటీ దీపావళిగా జరుపుకుంటారు.
ఇంకా చెప్పాలంటే నవంబర్ 12వ తేదీన దీపావళి( Diwali ) పండుగను జరుపుకుంటారు.

పురాణాల ప్రకారం ఈ రోజున శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చాడు.అందుకే ఈ దీపోత్సవం పండుగ జరుపుకుంటారు.ఇంకా చెప్పాలంటే నవంబర్ 13వ తేదీన సోమవతి అమావాస్యను వివాహిత మహిళలు తమ భర్తకు అదృష్టం, దీర్ఘాయువును కోరుకుంటూ వ్రతాన్ని జరుపుకుంటారు.
నవంబర్ 14వ తేదీన నెహ్రూ జయంతి, గోవర్ధన్ పూజను జరుపుకుంటారు.గోవర్ధన్ పూజ ఒక ప్రధాన హిందూ పండుగ అని పండితులు చెబుతున్నారు.ఈ రోజున గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఇంద్రుడి గర్వాన్ని శ్రీకృష్ణుడు ఛేదించేశాడు.నవంబర్ 17వ తేదీన నాగుల చవితిని జరుపుకుంటారు.
నవంబర్ 19వ తేదీన ఛత్ పూజను ఉత్తర భారత దేశంలో ఎంతో వైభవంగా జరుపుకుంటారు.ఈ పండుగను నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు.
నవంబర్ 23వ తేదీన దేవుత్తన ఏకాదశిని, నవంబర్ 27వ తేదీన కార్తీక పూర్ణిమను,నవంబర్ 30వ తేదీన సంకష్టహర చతుర్థి జరుపుకుంటారు.