అమెరికాలో త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల కోసం డెమోక్రటి పార్టీ తరుపునుంచీ ఎంతో మంది నేతలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే.అయితే రిపబ్లికన్ పార్టీ నుంచీ ట్రంప్ ఒక్కడే పోటీకి ఉండటంతో ఆ పార్టీలో అభ్యర్ధి విషయంలో ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు.
కానీ డెమోక్రటిక్ పార్టీ తరుపునుంచీ సుమారు అరడజనుకి పైగా అభ్యర్ధులు పోటీ పడుతున్నారు.ఈ క్రమంలోనే
ట్రంప్ తో పోటీ పడే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిత్వం కోసం జరిగిన అయోవా కాకసస్ లో డెమోక్రటి సోషలిస్ట్ బెర్నీ విజయం సాధించారు.
తుది ఫలితాల ఆధారంగా ఆయన సుమారు 6 వేలకి పైగా ఓట్ల ఆధిక్యతతో తన సమీప ప్రత్యర్ధి బుటీగీగ్ పై గెలిచారు.ఇదిలాఉంటే బెర్నీ సాండర్స్ విజయాన్ని కావాలనే తొక్కడానికి డెమోక్రటిక్ పార్టీలో ఓ వర్గం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.

బెర్నీ విజయాన్ని గడిచిన మూడు వారాలపాటు తొక్కి పట్టి ఉంచినా తుది ఫలితాలు వచ్చేసరికి బెర్నీ విజయాన్ని అంగీకరించక తప్పలేదు.అంతేకాదు ఒపీనియన్ పోల్స్ సైతం బెర్నీ గెలుపు అక్కడ అనివార్యమని చెప్పాయి.అయితే ఈ ఎన్నిక నిర్వహణంకి థర్డ్ పార్టీగా ఉపయోగించిన యాప్ లో సాంకేతిక లోపం కారణంగా డెమోక్రాట్లు నిర్వహించిన పోలింగ్ ఫలితాలపై ఆధారపడవాల్సి వచ్చిందని తెలుస్తోంది.