బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.ఈ క్రమంలోనే అక్టోబర్ 2వ తేదీ క్రూజర్ షిప్ పై దాడి చేసిన అధికారులు అక్కడ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు.
ప్రస్తుతం ఆర్యన్ ముంబై ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్నాడు.ఈ క్రమంలోని ఆర్యన్ బెయిల్ కోసం షారుక్ ఖాన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అతనికి మాత్రం కోర్టు నుంచి నిరాశే ఎదురవుతోంది.
ఈ క్రమంలోనే ఆర్యన్ ఖాన్ అరెస్ట్ విషయంపై పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల స్పందిస్తూ ఆయనకు మద్దతుగా నిలబడ్డారు.కేవలం కొందరి రాజకీయ లబ్ధి కోసమే ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసి అతనిని ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఆర్యన్ ఖాన్ కి మద్దతుగా నిలబడ్డారు.ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత సంజయ్ గుప్తా ట్విట్టర్ ద్వారా తన మద్దతును షారుక్ ఖాన్ కి తెలియజేశారు.

ఈ క్రమంలోనే సంజయ్ గుప్తా మాట్లాడుతూ బాలీవుడ్ ఇండస్ట్రీలో షారుక్ ఖాన్ ఎంతోమందికి ఎంతో సహాయం చేశారు.ప్రస్తుతం ఆయన ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీ ఎందుకు నిశ్శబ్దం వహిస్తోంది.ఇలా ఇండస్ట్రీకి ఎంతో చేసిన షారుఖాన్ విషయంలో ఇలాంటి నిశబ్ద పాటించడం ఎంతో అవమానకరమని సంజయ్ గుప్తా పేర్కొన్నారు.ఇవాళ ఆర్యన్ ఉన్నారు.రేపు మీ పిల్లలో మా పిల్లలో ఉంటే అప్పుడు కూడా ఇలాంటి నిశ్శబ్దాన్ని పాటిస్తారా అంటూ సంజయ్ గుప్తా ట్విట్టర్ ద్వారా షారుక్ ఖాన్ కి మద్దతు తెలియజేశారు.