తెలుగు సినిమా ఇండస్ట్రీ లో శ్రీను వైట్లది( Srinu Vaitla ) ప్రత్యేక స్థానం.చిన్న సినిమా లతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి సూపర్ స్టార్ మహేష్ బాబు తో దూకుడు సినిమా ను( Dookudu Movie ) రూపొందించి ఇండస్ట్రీ హిట్ ని దక్కించుకున్నాడు.
దూకుడు సినిమా తర్వాత ఇప్పటి వరకు శ్రీను వైట్ల సక్సెస్ లను సొంతం చేసుకోలేక పోయాడు.ఆగడు, బ్రూస్ లీ ఇంకా కొన్ని సినిమాలు చేశాడు.
కానీ ఏ ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు.శ్రీను వైట్ల సినిమా అంటే జనాలు లైట్ తీసుకుంటున్నారు.
ఒకప్పుడు హీరో తో సంబంధం లేకుండా శ్రీను వైట్ల సినిమా ల కోసం అభిమానులు వెయిట్ చేసేవారు.కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ లో ఉంది.

నాలుగు అయిదు డిజాస్టర్ లను ఇచ్చినా కూడా శ్రీను వైట్లకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.ప్రస్తుతం గోపీచంద్( Gopichand ) హీరో గా శ్రీను వైట్ల సినిమా రూపొందుతోంది.అందుకు సంబంధించిన షూటింగ్ ను నేటి నుండి యూఎస్ లో ( USA ) ప్రారంభించినట్లుగా సమాచారం అందుతోంది.శ్రీను వైట్ల మార్కెట్ ఏమాత్రం బాగాలేదు.ఇక గోపీచంద్ మార్కెట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.వీరిద్దరి కాంబో కి కనీసం 15 నుంచి 20 కోట్ల రూపాయల బిజినెస్ అయ్యే పరిస్థితి లేదు.

అలాంటి సమయంలో వీరి సినిమా ను విదేశాల్లో చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు విమర్శిస్తున్నారు.శ్రీను వైట్ల మరియు గోపీచంద్ కాంబో మూవీ ని జనాలు చూస్తారా లేదా అనేది డౌటే.సినిమా కి భారీ హిట్ టాక్ వస్తే అప్పుడు థియేటర్లకు జనాలు వస్తారేమో.అంతే తప్ప సినిమా మొదటి రోజే భారీ వసూళ్లు వస్తాయి అనుకుంటే మాత్రం అది కచ్చితంగా అత్యాశ అవుతుంది.
కనుక శ్రీను వైట్ల బడ్జెట్ విషయం లో తగ్గించుకుంటే బెటర్ అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.