ఒత్తైన, నల్లని కురులను కావాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది.కానీ జుట్టు సంరక్షణ విషయంలో మాత్రం చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు.
దీని కారణంగా జుట్టు ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుంది.ఫలితంగా జుట్టు విపరీతంగా రాలడం, చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం తదితర సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి.
కానీ వారంలో ఒక్కసారి ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే మీ జుట్టు ఒత్తుగా మరియు నల్లగా పెరుగుతుంది.
పైగా ఈ రెమెడీ వల్ల ఎన్నో ప్రయోజనాలు సైతం లభిస్తాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందు ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి పెట్టుకోవాలి.
అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకుని పొట్ట తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పొట్టు తొలగించిన వెల్లుల్లి రెబ్బలు, నాలుగు నుంచి ఐదు మందారం ఆకులు, గుప్పెడు కరివేపాకు మరియు ఒక కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి.

ఆపై షవర్ క్యాప్ ధరించి గంట లేదా గంటన్నర పాటు వదిలేయాలి.అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా తల స్నానం చేయాలి.వారంలో ఒక్కసారి ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
కురులు ఒత్తుగా, పొడుగ్గా మరియు నల్లగా పెరుగుతాయి.తెల్ల జుట్టు వచ్చే సమస్య తగ్గుతుంది.
ఒకవేళ తెల్ల జుట్టు ఉంటే క్రమంగా నల్లబడుతుంది.ఈ రెమెడీని పాటించడం వల్ల జుట్టు షైనీ గా సైతం మెరుస్తుంది.
కాబట్టి, తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి.