1.శ్రీకాకుళంలో రేపు చంద్రబాబు పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబు రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు.ఆమదాలవలస నియోజకవర్గంలోని పొందూరు మండలం దల్లవలస గ్రామం లో ఆయన పర్యటించనున్నారు.
2.గడపగడపకు వైఎస్సార్సీపీ
నేటి నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గడపగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమం నిర్వహించనున్నారు.
3.శ్రీశైలం సమాచారం
నేడు శ్రీశైలం స్వామి అమ్మవార్లకు ఆలయంలో సహస్రదీపాలంకరణ , వెండి రథోత్సవం నిర్వహించనున్నారు.
4.నారా లోకేష్ పర్యటన
నేడు టీడీపీ నేత నారా లోకేష్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతి చెందిన టీడీపీ నేత రాజు వర్ధన్ రెడ్డి తండ్రి విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు.
5.జగన్ సమీక్ష
పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ పై నేడు ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
6.ఒంగోలు రిమ్స్ కు మహిళా కమిషన్ చైర్మన్
నేడు ఒంగోలు రిమ్స్ కు మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ , మంత్రి ఆదిమూలపు సురేష్ వెళ్లనున్నారు.
7.నేడు కేసీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం
నేడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.
8.గ్రూప్ వన్ దరఖాస్తులు
తెలంగాణలో నేటి నుంచి గ్రూప్ వన్ దరఖాస్తులు.ఈ నెల 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
9.తెలంగాణ కు వర్ష సూచన
ఏపీ తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
10.బిగ్ బాస్ షో పై హైకోర్టు ఆగ్రహం
ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.రియాల్టీ షో పేరిట ఏదైనా చూపిస్తా మంటే ఉపేక్షించేది లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
10.షర్మిల పాదయాత్ర
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం పరిధిలో 73 వ రోజు షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది.
11.రాహుల్ రేవంత్ పై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు
రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి పై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు హైకోర్టు న్యాయవాది రామారావు ఫిర్యాదు చేశారు.ఉస్మానియా యూనివర్సిటీ లో విద్యార్థుల మధ్య ఘర్షణ ప్రేరేపించే విధంగా శాంతిభద్రతల పరిరక్షణ మరియు వివిధ అంశాలపై ఆయన ఫిర్యాదు చేశారు.
12.పబ్ వ్యవహారం పై జగ్గారెడ్డి కామెంట్స్
నేత రాహుల్ గాంధీ పప్పు వెళ్లారని జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీకి చెందిన తెలంగాణ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు.
13.ఘనంగా రంజాన్ వేడుకలు
హైదరాబాద్ నగరంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
14.బండి సంజయ్ జుటా మనిషి
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శలు చేశారు బండి సంజయ్ జూట మనిషి అని, బిజెపి జూటా పార్టీ అంటూ విమర్శించారు.
15.సింహాద్రి అప్పన్న సేవ లో తమిళనాడు గవర్నర్
తమిళనాడు గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ విశాఖ సింహాద్రి అప్పన్న ను దర్శించుకున్నారు.
16.ఓయూలో మరోసారి ఉద్రిక్తత
ఉస్మానియా యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది.రాహుల్ గాంధీ పర్యటన ను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాహుల్గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
17.విజయశాంతి కామెంట్స్
రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్న అత్యాచారాలు దారుణాల పై బీజేపీ నేత విజయశాంతి సోషల్ మీడియా వేదికగా ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.
18.తెలంగాణ బీజేపీ నేతల డిమాండ్
జవహర్ నగర్ లో లీచెట్ శుద్ది లో 130 కోట్ల కుంభకోణం జరిగిందని బీజేపీ నేతలు విమర్శించారు దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
19.రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
తెలంగాణ ముస్లిం సోదరులకు టిపిసిసి అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,200 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,510