శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించిందే మేడే అని సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ అన్నారు .ఖమ్మం జిల్లా ప్రధాన హాస్పిటల్ ముఖ ద్వారం వద్ద మేడే వారోత్సవాల్లో భాగంగా ఈరోజు పోటు ప్రసాద్ ఏఐటీయూసీ జెండా ఆవిష్కరించారు .
అనంతరం జరిగిన సభలో పోటు ప్రసాద్ , ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి బిజి క్లెమెంట్ మాట్లాడుతూ మెడికల్ రంగంలో ఏఐటీయూసీ ఎనలేని కృషి చేసిందని నిజాం కాలంలోనే మొదటిసారిగా మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ను ప్రారంభించిన ఏకైక సంఘం ఏఐటీయూసీ నేను అని వాళ్ళు ఈ సందర్భంగా తెలియజేశారు .తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు డాక్టర్ రాజ్ భహదూర్ గౌర్ నాయకత్వంలో నిజాం కాలంలో వైద్య సిబ్బంది , మెడికల్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేసి ఎన్నో విజయాలను సాధించింది అన్నారు .ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ (MEU) మెడికల్ ఉద్యోగుల కొరకు అహర్నిశలు కృషి చేసిందని , పోరాటాలు చేసి ఎన్నో జీవోలను సాధించిందని వారు గుర్తు చేశారు .గతంలో ఖమ్మంలో కూడా బలమైన యూనియన్ గా ఉండేదని , కానీ కొన్ని కారణాల వలన వెనకబడి పోయిందన్నారు .ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్న ఈ తరుణంలో మరలా మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ను పునరుద్ధరణ చేయటం సంతోషించదగ్గ విషయమన్నారు .రాబోయే రోజుల్లో మెడికల్ రంగంలో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించనున్నట్లు వారు తెలియజేశారు .శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ఆవిర్భవించిన ఎర్రజెండా అండతో కార్మికులు , కర్షకులు తమ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం పోరాటాలు చేయాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో ఏ ఐ టి యు సి ఖమ్మం జిల్లా అధ్యక్షులు గాదే లక్ష్మీనారాయణ , బి కే ఎం యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు , తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఖమ్మం జిల్లా గౌరవ అధ్యక్షులు తోట రామాంజనేయులు , కార్పొరేటర్ చామకూరి వెంకన్న , ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు పేర బోయిన మోహన్ రావు , ఏఐవైఎఫ్ నాయకులు సతీష్ రెడ్డి , ఏఐటీయూసీ నాయకులు నాగేశ్వరరావు , వీరన్న , ఉపేందర్ , మైఖేల్ తదితరులు పాల్గొన్నారు .







