మానవాళిని పట్టిపీడిస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో మధుమేహం( Diabetics ) ఒకటి.ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే మధుమేహం ఎక్కువగా కనిపించేది.
కానీ ఇప్పటి రోజుల్లో యంగ్ ఏజ్ వారు సైతం మధుమేహం బారిన పడుతున్నారు.ఈ వ్యాధిని అదుపు చేసుకోకపోతే శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి.
అందులో సంతానలేమి కూడా ఒకటి.కొన్ని సందర్భాల్లో పిల్లలు కలగకపోవడానికి మధుమేమం కూడా కారణం అవుతుంది.
సంతానోత్పత్తి సామర్థ్యాన్ని మధుమేహం ప్రభావితం చేస్తుంది.మహిళల్లో మధుమేహం ఉండటం వల్ల గర్భం దాల్చే సామర్థ్యం తగ్గుతుంది.
ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ముందస్తు ప్రసవం లేదా మిస్ క్యారేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది.పిండం ఎదుగుదలపై సైతం ప్రభావం పడుతుంది.
అలాగే పురుషుల్లో మధుమేహం ఉండడం వల్ల అంగస్తంభన, ముందస్తు స్ఖలనం, వీర్యకణాల సంఖ్య తగ్గిపోవడం, వీర్యకణాల నాణ్యత దెబ్బతినడం వంటివి తలెత్తుతాయి.

అందుకే మధుమేహం ఉన్నవారు ( Diabetics )పిల్లల కోసం ప్రయత్నిస్తుంటే ఖచ్చితంగా కొన్ని టిప్స్ ను ఫాలో అవ్వాలి.మధుమేహం ఉన్నవారు పోషకాలు మెండుగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.హెల్తీ డైట్ ను మెయింటైన్ చేయాలి.
పంచదార, పంచదార తో తయారు చేసిన స్వీట్స్, బేకరీ ఫుడ్, జంక్ ఫుడ్స్ ను పూర్తిగా దూరం పెట్టాలి.మాంసాహారం తగ్గించాలి.
తాజా కూరగాయలు, ఆకుకూరలు పండ్లు, నట్స్, సీడ్స్, చిరుధాన్యాలు, తృణధాన్యాలు, మొలకెత్తిన విత్తనాలు తీసుకోవాలి.

అలాగే స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లు ఉంటే కచ్చితంగా మానేయాలి.నిత్యం కనీసం ఇరవై నుంచి ముప్పై నిమిషాలు అయినా వ్యాయామం చేయాలి.వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్( Running swimming ) ఇలా మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు.
ఒత్తిడిని ఎప్పుడు అదుపులో ఉంచుకోవాలి.కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోవాలి.
ఈ సింపుల్ టిప్స్ ను ఫాలో అవ్వడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.అదే సమయంలో హార్మోన్ల అసమతుల్యత దూరం అవుతుంది.
దంపతుల్లో ఫెర్టిలిటీ కెపాసిటీ, రిప్రొడక్టివ్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది.







