కొంతమందికి బ్లాక్ హెడ్స్ ఇబ్బంది పెడుతూ ఉంటే….మరి కొంతమందికి వైట్ హెడ్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
ఇవి ముక్కు,నుదురు మీద ఎక్కువగా ఉంటాయి.ఈ సమస్యను సులభంగా ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు.స్నానం చేయటానికి ముందు ముఖానికి ఆవిరి పట్టాలి.ఈ విధంగా చేయటం వలన వైట్ హెడ్స్ కొంచెం బయటకు వస్తాయి.దాంతో వాటిని తొలగించటం సులభం అవుతుంది.
రెండు స్పూన్ల ఓట్స్ పొడిలో నీటిని కలిపి మెత్తని పేస్ట్ గా చేయాలి.
సమస్య ఉన్న ప్రదేశంలో ఈ పేస్ట్ ని రాసి పావు గంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి.ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.
ఒక స్పూన్ వంటసోడాలో సరిపడా నీటిని పోసి పేస్ట్ చేయాలి.ఈ పేస్ట్ ని వైట్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో రాసి ఆరాక శుభ్రంగా కడగాలి.
ఈ విధంగా చేయటం వలన వైట్ హెడ్స్ తొలగిపోవటమే కాకుండా జిడ్డు కూడా పోతుంది.ఒక స్పూన్ శనగపిండిలో ఆలివ్ నూనె కలిపి వైట్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో రాసి ఆరాక శుభ్రం చేసుకుంటే వైట్ హెడ్స్ తో పాటు మృత కణాలు కూడా తొలగిపోతాయి.
చిన్న బంగాళాదుంపను తీసుకోని సమస్య ఉన్న చోట రుద్దాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేయాలి.