చిన్న పిల్లలు ఏది చేసినా సరే పెద్దలు దాన్ని సరదాగానే చూస్తుంటారు.అయితే ఈ సరదా కొన్నిసార్లు మితిమీరితే ఏం జరుగుతుందో ఇప్పటికే చాలా ఘటనలు చూస్తూనే ఉన్నాం.
కొన్ని సార్లు ప్రాణాల మీదకు కూడా తెస్తుంటాయి ఇలాంటి పిచ్చి చేష్టలు.పిల్లలు అల్లరి చేయడం కామనే.
కానీ ఆ అల్లరి మితిమీరిందంటే మాత్ంర ప్రస్తుతం మనం చెప్పుకోబోయే బాలుడి తల్లిలాగా ఏడవాల్సి వస్తుంది.ఇప్పుడు మనం ఓ అల్లరి పిల్లాడు చేసిన పనికి తల్లి ఎంతలా బాధపడిందో తెలుసుకోబోతున్నాం.
ఆ గడుగ్గాయి చేసిన పనికి ఆమె విలవిలలాడిపోయింది.
ఆ పిల్లాడు ఏదో సరదాగా చేద్దామనుకున్నాడు.
కానీ అదే ప్రాణాల మీదకు తీసుకు వచ్చింది.ఇలాంటి అనూహ్య ఘటనలు సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అవుతుంటాయో మనవ చూస్తూనే ఉన్నాం.
మరి ఈ ఘటన వైరల్ కాకుండా ఉంటుందా చెప్పండి.అందుకే చాలా సింపుల్ గానే ఇది ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.
దీన్ని చూసిన వారంతా ఇదేం సరదా అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.విషయంలోకి వస్తే ఓ బుడ్డోడు సరదాగా సైకిల్ లాక్ తో ఆడుకుంటు్నాడు.
కాగా తన తల్లి మెడకు దీన్ని వేశారు.
అయితే ఆ లాక్‌ను ఓపెన్ చేసే కోడ్‌ను మరిచిపోవడతో అది ఓపెన్ కాలేదు.ఇంకేముంది ఆమె భయాందోళనతో వణికిపోయింది.అది ఎక్కడ టైట్ గా బిగుసుకుంటుందో అని అంతా టెన్షన్ పడ్డారు.
ఈ ఘటన చైనా దేశంలోని ప్రావిన్స్‌లోని హువాన్‌లో జరిగిందని తెలుస్తోంది.కాగా ఆ తల్లి చివరకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వారి సాయం అడిగింది.
ఇక వారు వచ్చి చూసి తమ వల్ల కాదని చివరకు అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు.వారు వైర్ కట్టర్ సాయంతో ఆ లాక్‌ను కట్ చేసి ఆమె మెడ నుంచి తీసివేశారు.
ఇలా ఓ చిన్నారి సరదా ఇంత పని చేసింది.