చిట్లిన జుట్టును రిపేర్ చేసే ఎఫెక్టివ్ రెమెడీ ఇది.‌. వారానికి ఒక్కసారి ట్రై చేసినా చాలు!

సాధారణంగా కొందరి జుట్టు తరచూ చిట్లిపోతూ ఉంటుంది.ఎన్ని సార్లు జుట్టు చివర్లు కత్తిరించిన సరే మళ్లీ మళ్లీ అదే సమస్య తలెత్తుతుంది.

 Try This Effective Remedy For Repairing Damaged Hair! Damaged Hair, Home Remedy,-TeluguStop.com

దీంతో ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక తెగ సతమతం అయిపోతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీ మీకు చాలా ఎఫెక్టివ్‌ గా సహాయపడుతుంది.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని ట్రై చేసినా చాలు చిట్లిన జుట్టును సులభంగా రిపేర్ చేసుకోవచ్చు.

కురులను ఒత్తుగా మరియు మృదువుగా మెరిపించుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Telugu Damaged, Care, Care Tips, Healthy, Remedy, Latest, Split Ends, Thick-Telu

ముందుగా ఒక కలబంద ఆకు( Aloe vera ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు మరియు కట్‌ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు వేసి దాదాపు ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.దాంతో వాటర్ కాస్త జెల్లీ స్ట్రక్చర్ లోకి మారుతుంది.

Telugu Damaged, Care, Care Tips, Healthy, Remedy, Latest, Split Ends, Thick-Telu

అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాస్త వేడి చల్లారిన తర్వాత స్టైనర్ లేదా క్లాత్ సహాయంతో జెల్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జెల్ లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు పెరుగు మరియు వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive oil ) వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా త‌యారు చేసుకున్న‌ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలివారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే జుట్టు చిట్లడం సమస్య దూరం అవుతుంది.

చిట్లిన జుట్టు మళ్ళీ మామూలు స్థితికి చేరుకుంటుంది.అలాగే ఈ రెమెడీ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.మీ జుట్టును హైడ్రేట్ చేస్తుంది.హెయిర్ రూట్స్ ను బలపరుస్తుంది.

చుండ్రు మరియు దురద చికిత్సకు సహాయపడుతుంది.జుట్టును మృదువుగా ఉంచుతుంది.

షైనీ గా మెరిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube