యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొత్త కారును కొనుగోలు చేశారని కొన్నిరోజుల క్రితం వార్తలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.అయితే ఎన్టీఆర్ పీఆర్వో ఆ కారు ఎన్టీఆర్ కారు కాదని గతంలో స్పష్టతనిచ్చారు.
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఎక్కువమంది హీరోలు లగ్జరీ కార్లను చాలా ఇష్టపడతారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కూడా కార్లు అంటే చాలా ఇష్టం కాగా ఎన్టీఆర్ చాలారోజుల క్రితం ఖరీదైన లంభోర్గిని కారును బుక్ చేశారు.
అయితే ఈ కారు తాజాగా ఇండియాకు చేరుకుందని సమాచారం.దేశంలోనే తొలి లంభోర్ఘిని ఉరుట్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎన్టీఆర్ సొంతమైందని తెలుస్తోంది.ఈ మోడల్ కారు ధర మూడు కోట్ల 15 లక్షల రూపాయల నుంచి మూడు కోట్ల 43 లక్షల రూపాయల మధ్య ఉంటుందని సమాచారం.ఎక్స్ ట్రార్డినరీ ఫీచర్లతో ఉన్న కారుకు సంబంధించిన ఫోటోలను బెంగళూరుకు చెందిన ఆటో మొబైలియార్డెంట్ పోస్ట్ చేశారు.

అయితే ఎన్టీఆర్ టీమ్ ఈ వార్తల గురించి స్పందించి స్పష్టతనివ్వాల్సి ఉంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఉక్రెయిన్ లో షూటింగ్ తో బిజీగా ఉన్నారు.లంభోర్గినియూరస్ కారుకు భారీగా డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో డెలివరీ ఆలస్యమైందని తెలుస్తోంది.స్టైలిష్ లుక్ తో ఉన్న ఎన్టీఆర్ కొత్త కారు ఎంతో బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పటికే పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు.

మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీ ఉక్రెయిన్ షెడ్యూల్ దాదాపుగా పూర్తైందని సమాచారం.ఎన్టీఆర్, చరణ్ ఇప్పటికే మంచి స్నేహితులు కాగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ సమయంలో వాళ్ల స్నేహ బంధం మరింత చిగురిస్తోందని తెలుస్తోంది.ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ గురించి చాలా వార్తలు ప్రచారంలోకి వస్తుండగా చిత్రయూనిట్ ఆ వార్తల గురించి స్పందించాల్సి ఉంది.