ప్రస్తుత కాలంలో యువత చెడు వ్యసనాల బారిన పడడం, కష్టపడకుండా సంపాదన కోసం అడ్డదారులలో వెళ్ళడం, స్వార్థం కోసం ఎంతటి దారుణాల కైనా పాల్పడడం విపరీతంగా పెరుగుతూ ఉండడంతో సమాజంలో మానవత్వానికి చోటు లేకుండా పోతోంది.కుటుంబ బాధ్యతలను మరిచి మద్యం లాంటి చెడు అలవాట్లకు( Bad Habits ) బానిసైన వ్యక్తులు చేసే దారుణాలు కుటుంబాలను రోడ్డున పడేస్తాయి అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.
ఇలాంటి కోవలోనే ఓ యువకుడు మద్యానికి బానిసై మద్యం మత్తులో తల్లితో గొడవపడ్డాడు.గొడవను ఆపేందుకు ప్రయత్నించిన అన్నను దారుణంగా చంపేసిన ఘటన ఖమ్మంలోని( Khammam ) ములకలపల్లి మండలంలో చోటుచేసుకుంది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

ములకలపల్లి ఎస్సై సాయి కిషోర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.ఖమ్మంలోని ములకలపల్లి మండలం మొగారాళ్ళ గుప్ప గ్రామంలో కీసరి రామారావు, వెంకటేష్ అనే అన్నదమ్ములు నివసిస్తున్నారు.రామారావు( Ramarao ) మద్యానికి బానిసై కుటుంబ బాధ్యతలను మరిచాడు.
ఈ క్రమంలో ఆదివారం రాత్రి పీకలదాకా మద్యం తాగిన రామారావు ఇంటికి వెళ్లి మద్యం మత్తులో కన్నతల్లితో( Mother ) గొడవకు దిగాడు.ఇంట్లో ఉన్న తమ్ముడు గొడవను అడ్డుకునే ప్రయత్నం చేయగా గొడవ మరింత పెరిగింది.
తమ్ముడు వెంకటేష్( Venkatesh ) క్షణికావేశంలో ఇంట్లో పొయ్యిలో ఉన్న కట్టెతో రామారావు తలపై గట్టిగా కొట్టాడు.

రామారావు కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు.స్థానికులు గొడవ విని వచ్చి చూసే లోపే రామారావు ప్రాణాలు కోల్పోయాడు.స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ములకలపల్లి ఎస్సై సాయి కిషోర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.