ప్రస్తుతం వాతావరణంలో సంభవించిన మార్పుల వల్ల అనేక రకాల అంటువ్యాధులు మనల్ని వెంటాడుతుంటాయి.చలికాలం మొదలవడంతో ఎక్కువగా జలుబు, దగ్గు, ముక్కు కారడం వంటి సమస్యలు ఎంతో చిరాకు పెడుతుంటాయి.
కానీ ఎన్ని మందులు వాడినప్పటికీ కొన్నిసార్లు ఈ వ్యాధులు ఎంతో వేధిస్తుంటాయి.అయితే ఇలాంటి సీజనల్ వ్యాధుల కోసం మన ఇంట్లో పెద్ద వారు అప్పుడప్పుడు వంటింటి చిట్కాలను చెబుతుంటారు.
కేవలం ఈ చిట్కాలను పాటించడం ద్వారా తక్షణమే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు కూడా చెబుతున్నారు.ఈ చిట్కాలలో భాగంగా ఉల్లిపాయ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు తెలియజేశారు.
మన ఇంట్లో దొరికే ఈ ఉల్లిపాయను వంటలలో వాడడం వల్ల ఆ వంటకు ఎంతో రుచిని అందిస్తుంది.కేవలం వంటలలో రుచిని ఇవ్వడమే కాకుండా, మన ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను కల్పిస్తుంది.
చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధులకు ఉల్లిపాయ టీ తాగడం వల్ల సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం పొందడమే కాకుండా మన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది.ఈ ఉల్లిపాయలలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, మెగ్నీషియం, క్యాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
రోజువారి మన ఆహారంలో ఒక కప్పు ఉల్లిపాయ టీని తాగడం ద్వారా రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా, ఇలాంటి అంటువ్యాధుల నుంచి మనకు ఉపశమనం కలిగిస్తుంది.ఈ ఉల్లిపాయ టీ ను తయారు చేసుకోవడానికి కొద్దిగా నీటిలో టీ పౌడర్ ను వేసి బాగా ఉడికించాలి.అందులో కొద్దిగా యాలకులు, మిరియాలను వేసి మరిగించిన తర్వాత ఆ నీటిని పక్కన పెట్టుకోవాలి వేడిగా ఉన్న ఈ నీటిలోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కను వేసి దాదాపు పది నిమిషాల పాటు ఆ వేడి నీటిలో నానబెట్టాలి.తరువాత నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు దానిలో కొద్దిగా తేనె కలుపుకుని ప్రతిరోజూ ఒక కప్పు తాగటం ద్వారా సీజనల్ వ్యాధుల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.