గుంటూరు కారం విషయంలో మేము చేసిన తప్పు ఇదే.. నాగవంశీ సంచలన వ్యాఖ్యలు వైరల్!

మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన గుంటూరు కారం( Guntur Kaaram ) సినిమాకు ఆశించిన టాక్ రాకపోయినా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టిస్తోంది.ఈ సినిమా గురించి నిర్మాత నాగవంశీ ( Naga Vamsi )మాట్లాడుతూ గుంటూరు కారం సినిమాకు బెనిఫిట్ షోస్ వేసి తప్పు చేశామని పేర్కొన్నారు.

 Nagavamsi Comments About Guntur Karam Movie Details Here Goes Viral In Social M-TeluguStop.com

ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకొచ్చారు.కలెక్షన్లు ఫేక్ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఎవరైనా అలా ఆరోపణలు చేస్తే ప్రూవ్ చేయాలని నాగవంశీ చెప్పుకొచ్చారు.

Telugu Guntur Kaaram, Mahesh Babu, Nagavamshi, Nagavamsi, Premiere Show, Sreelee

మహేష్ త్రివిక్రమ్ కాంబో అనేసరికి ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్ అని ఫ్యాన్స్ భావించారని ఆయన అన్నారు.అందువల్ల ప్రీమియర్ షో ఆడియన్స్ నిరాశకు గురయ్యారని నాగవంశీ కామెంట్లు చేశారు.దానివల్లే సినిమాపై నెగిటివిటీ వచ్చిందని ఫీలవుతున్నానని నాగవంశీ పేర్కొన్నారు.గుంటూరు కారం ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే విషయాన్ని ముందుగా ప్రచారం చేయలేకపోయామని ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Guntur Kaaram, Mahesh Babu, Nagavamshi, Nagavamsi, Premiere Show, Sreelee

ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ప్రచారం చేయడానికి తగినంత సమయం మాకు కూడా లేకుండా పోయిందని నాగవంశీ పేర్కొన్నారు.అలా చెప్పి ఉంటే బాగుండేదని అనిపించిందని ఆయన అన్నారు.జనవరి 5వ తేదీ వరకు గుంటూరు కారం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిగాయని హైదరాబాద్ లో గుంటూరు కారం ఈవెంట్ ప్లాన్ చేశామని నాగవంశీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Telugu Guntur Kaaram, Mahesh Babu, Nagavamshi, Nagavamsi, Premiere Show, Sreelee

ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు అర్ధరాత్రి షో వేసి తప్పు చేశానని ఆయన అన్నారు.ప్రీమియర్స్ తర్వాత వచ్చిన రివ్యూలు చూసి షాకయ్యానని నాగవంశీ చెప్పుకొచ్చారు.మహేష్ బాబు మాత్రం స్ట్రాంగ్ గా ఉన్నారని రెండో రోజు నుంచి రివ్యూలు మారతాయని నమ్మారని ఆయన చెప్పినట్టే జరిగిందని నాగవంశీ చెప్పుకొచ్చారు.

నాగవంశీ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.గుంటూరు కారం ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube