తెలుగులో సమంత, తమిళ్ లో జ్యోతిక, మలయాళం లో మంజు వారియర్ ..ముగ్గురిలో ఒక పోలిక

సినిమా ఇండస్ట్రీకి రావాలని ప్రతి ఒక్కరు ఎన్నో కలలు కంటారు.ఇండస్ట్రీలోకి వచ్చాక కూడా ఎన్నో ఏళ్ల పాటు తమ కెరియర్ కొనసాగాలని కోరుకుంటూ ఉంటారు.

 Actresses With Lady Oriented Movies,samantha,manju Warrier,jyothika,lady Oriente-TeluguStop.com

కానీ అలా అందరికీ కుదరకపోవచ్చు కానీ కొంతమంది యాక్టర్స్ మాత్రం ఎన్ని ఏళ్ళు గడిచినా ఆ కెరియర్ అలాగే కొనసాగుతుంది.అలాగే వారి అందంలో కూడా ఎలాంటి మార్పు రాదు.

ఏళ్లకు ఏళ్ళు హీరోయిన్ గా కొనసాగుతూనే ఉంటారు.మరి అలా ఎన్నో ఏళ్ల పాటు పెళ్లయినా కూడా సినిమాల్లోనే నటిస్తూ ఇప్పటికి స్టార్ హీరోయిన్స్ గా చెలామణి అవుతున్న ఆ నటీమణులు ఎవరో తెలుసుకుందాం

సమంత:

అప్పుడెప్పుడో ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది సమంత.ఈ సినిమా వచ్చి ఎన్నో ఏళ్ళు గడిచిన ఆమెలో అందం ఏ మాత్రం తగ్గలేదు.చివరికి పెళ్లి చేసుకుని అక్కినేని వారి ఇంటికి కోడలు అయినా సరే సినిమాల్లో హీరోయిన్ గా చలామణి అయింది.

అయితే అనుకోకుండా విడాకులు తీసుకొని ప్రస్తుతం హాట్ హీరోయిన్ గా మారిపోయింది సమంత.ఇక ప్రస్తుతం ఎన్నో సినిమాల్లో సమంత నటిస్తుంది.తెలుగులో ఇలా ఏకకాలంలో ఇంత అవకాశాలు దక్కించుకున్న హీరోయిన్ లలో ఒక్క సమంత మాత్రమే అని చెప్పాలి.

మంజు వారియర్ :

మంజు వారియర్ సైతం సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు మూడు దశాబ్దాలు గడిచింది.పెళ్లి చేసుకొని పెళ్లికి ఎదిగిన ఒక బిడ్డ ఉన్నా కూడా ఆమెలో అందం ఏ మాత్రం తగ్గకపోగా, హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ కి ఉన్న ఒకే ఒక ఆప్షన్ గా మంజు వారియర్ కి ఉంది.ఇక ఇలా ఇన్నేళ్లు కెరీర్ ని కోనసాగిస్తూ చెక్కుచెదరని అందంతో మలయాళం లో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న హీరోయిన్ లలో మంజు వారియర్ ఒకరు

జ్యోతిక :

ఇక పాతికేళ్ల క్రితమే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటి జ్యోతిక.తమిళంలో స్టార్ హీరోయిన్ గా దశాబ్దానికి పైగా ఏక ఛత్రాధిపత్యం చేసి అక్కడ స్టార్ హీరోగా ఉన్న సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సినిమాల్లో రాణిస్తోంది.

ఇద్దరు బిడ్డల తల్లిగా ఉండి విమెన్ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరుగా తమిళనాడులో సంచలనం సృష్టిస్తుంది జ్యోతిక.

Star Heroines Lady Oriented Movies

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube