ప్రముఖ ఫొటో, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది.అయితే తాజాగా ఈ సోషల్ మీడియా దిగ్గజం యూజర్లు సులభంగా వీడియోలు షేర్ చేసుకునేందుకు వీలుగా ట్విట్టర్ రీట్వీట్ లాగా ఒక రీపోస్ట్ ఫీచర్‌ను విడుదల చేస్తోంది.
రీపోస్ట్ ట్యాబ్ రూపంలో ఉన్న ఈ కొత్త ఫీచర్ సాయంతో ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు ఇతర యూజర్ల పోస్ట్‌లు, రీల్ వీడియోలను వారి ప్రొఫైల్స్‌లో షేర్ చేసుకోవచ్చు.ఈ ఫీచర్‌ను టెస్ట్ చేస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ సంస్థ ఇప్పటికే వెల్లడించింది.
ప్రస్తుతానికి ఈ ఫీచర్ కొందరు యూజర్లకు లాంచ్ కాగా మిగతా వారికి త్వరలోనే అందుబాటులోకి రానుంది.
ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫీచర్ల సహాయంతో ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు వారి స్టోరీలలో మాత్రమే ఇతరుల పోస్ట్ లేదా వీడియోను రీపోస్ట్ చేయగలుగుతారు.24 గంటల తర్వాత ఆటోమేటిక్‌గా ఇవి అదృశ్యమవుతాయి.కానీ కొత్త రీపోస్ట్ ఫీచర్‌తో యూజర్లు తమ ప్రొఫైల్‌లో పోస్ట్‌ను ఆటోమేటిక్‌గా డిజప్పియర్ కాకుండా షేర్ చేసుకోవచ్చు.
సోషల్ మీడియా విశ్లేషకుడు మాట్ నవారా ఈ ఫీచర్ గురించి ఒక ట్వీట్‌లో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.చాలా ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల ప్రొఫైల్స్‌లో కొత్త ‘రీపోస్ట్’ ట్యాబ్ కనిపిస్తోందని, ఇది యూజర్ రీపోస్ట్ చేసిన ఫొటోలు లేదా వీడియోలను వారి ఫ్రెండ్స్, ఫాలోవర్స్ అందరికీ చూపిస్తుందని చెప్పుకొచ్చారు.
ఈ ఫీచర్ వల్ల పోస్ట్ షేర్ మెనూలో యూజర్లు తమ ప్రొఫైల్‌లో వాటిని షేర్ చేసుకునే ఒక బటన్ అందుబాటులో ఉంటుంది.ఒక పోస్ట్‌ను రీపోస్ట్ చేసేటప్పుడు యూజర్లు దానిపై తమకు నచ్చిన క్యాప్షన్ రాసుకోవచ్చు లేదా రియాక్షన్ కూడా ఇవ్వొచ్చు.అంటే ప్రస్తుతం ట్విట్టర్‌లో కోట్ ట్వీట్ ఫీచర్ లాగా అన్నమాట.అయితే, ఈ ఫీచర్ ఇంకా ప్రపంచవ్యాప్తంగా రెగ్యులర్ యూజర్లందరికీ రిలీజ్ కాలేదు.తన యాప్‌కి కొత్త రీపోస్ట్ ఫీచర్‌ను పరిచయం చేసే ముందు, ఇన్‌స్టాగ్రామ్ సెలెక్టెడ్ యూజర్లకు దీనిని పరిశీలిస్తోంది.వారి నుండి అభిప్రాయాన్ని సేకరించి ఈ ఫీచర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తే దీనిని తీసుకొస్తుంది.
అలానే బగ్‌లు ఏవైనా ఉంటే వాటిని ఫిక్స్ చేసిన తర్వాత ఆండ్రాయిడ్, iOS ప్లాట్‌ఫామ్‌ల రెండింటిలోనూ దీన్ని రిలీజ్ చేస్తుంది.