వీడియో: బైక్‌ చక్రంతో ట్రైన్‌లోని ప్యాసింజర్లపై నీళ్లు చల్లారు.. కట్ చేస్తే??

ఇటీవల కాలంలో యువత ఇతరులకు ఇబ్బంది కలిగించే ఆనందం పొందడమే పనిగా పెట్టుకున్నారు.ఇలాంటి ఆకతాయిలకు సంబంధించిన వీడియోలో అడపాదడపా వైరల్ అవుతూనే ఉన్నాయి.

 Video: Water Was Sprinkled On The Passengers Of The Train With A Bike Wheel., Pa-TeluguStop.com

తాజాగా సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతున్న ఇలాంటి మరో వీడియో సంచలనం సృష్టించింది.ఈ వీడియో పాకిస్థాన్‌ నుంచి వచ్చింది.

ఇందులో కొందరు యువకులు రైలు పట్టాల( Train tracks ) దగ్గర ఒక సరస్సులో ఒక మోటార్‌సైకిల్‌ను పార్క్ చేశారు.

వారి ప్లాన్ ఏమిటంటే, ఒక రైలు వెళ్ళేటప్పుడు దానిపై నీరు చిమ్మడం.ఇటీవల కూడా అలాగే చేశారు.వారు బండిని ఒక నీటి సరస్సులో పార్క్ చేసి యాక్సిలరేషన్ ఇచ్చారు దానికి కారణంగా టైరు నుంచి నీరు ఎగజిమ్ముతూ వంతెన పైనుంచి వెళ్తున్న ట్రైన్ లోని పాసింజర్లపై పడింది.

ఆ సరిస నీరు పడటంతో ప్రయాణికులు తడిసిపోయారు.ఈ దృశ్యాలు చూస్తూ ఆ పని చేస్తున్న అబ్బాయిలు ఎంజాయ్ చేశారు కానీ అంతలోనే ఆ రైలు అనుకోకుండా ఆగిపోయింది.

దీంతో, రైలు సిబ్బంది, కోపంగా ఉన్న ప్రయాణికులు ఆ యువకులను వెంబడించారు.ఆ యువకులు పారిపోయే సమయంలో పోలీసులు వారి మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.రైలు ఆలస్యం, ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించిన ప్రయాణికులు ఆ యువకులను పట్టుకుని వారికి నాలుగు తగిలించారు.ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారంటూ వారిని కొట్టారు.

వీడియోలో ఆ దృశ్యాలను చూడవచ్చు.ఆన్‌లైన్‌లో పాపులారిటీ కోసం ప్రమాదకరమైన పనులు చేసి వీడియోలు తీయడం పెరుగుతోంది.

ఇలాంటి ఘటనలు ప్రజలకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి, ప్రజల భద్రతను ప్రమాదంలో పడేస్తున్నాయి.

పాకిస్తాన్‌( Pakistan )కు చెందిన డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్ SA టైమ్స్ ఈ ఘటనను తన పేజీలో కూడా కవర్ చేసింది.ఇలాంటి ప్రమాదకరమైన పనులు భారతదేశంలో కూడా జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి.నేటి యువత గుర్తుంచుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి.

అదేంటంటే ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేయకూడదు.ఇలాంటి పనుల వల్ల తీవ్రమైన పరిణామాలు ఉండవచ్చు.

ప్రజల భద్రత చాలా ముఖ్యం, దానిని ఖచ్చితంగా పాటించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube