వీడియో: కుక్క కోసం ఈ వృద్ధుడు ఏం చేశాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..??

సోషల్ మీడియాలో కుక్కలు, వాటి యజమానులకు సంబంధించిన వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి.వాటిలో కొన్ని చూస్తే కంట్లో నీళ్లు తిరగకుండా ఉండలేవు.

 Growing Old Together Man Creates Ramp For His Ageing Dog Video Viral Details, Do-TeluguStop.com

అలాంటి ఒక హార్ట్ టచింగ్ వీడియో ఈ ప్రస్తుతం వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఒక వృద్ధుడు, ఒక ముసలి కుక్క కనిపించాయి.

ఎంతో కాలంగా వాళ్ళిద్దరూ స్నేహితులగా మెలుగుతున్నారు.ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చివరి దశలో ఉన్న జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.

అయితే వారి రీసెంట్ వీడియోలో వృద్ధుడు తన కారును ఎక్కడంలో కుక్కకు ( Dog ) సహాయం చేశాడు.

ఇందుకు వెనక నుంచి మడతపడే ప్లాస్టిక్ రాంప్ తీస్తాడు.

రాంప్‌ని( Ramp ) కారులోకి ఎక్కడానికి కుక్కకు సహాయం చేయడానికి పెడతాడు.రాంప్ సిద్ధంగా ఉన్నాక యజమాని కుక్కను మెల్లగా ముందుకు నడిపిస్తాడు.

అలా ప్రోత్సహిస్తుంటే కుక్క జాగ్రత్తగా ర్యాంపు ఎక్కి కారులోకి( Car ) ప్రవేశిస్తుంది.కారులోకి వెళ్ళాక, వృద్ధుడు తన డాగ్ ఫ్రెండ్ ని ప్రేమగా నిమిరి, కాసేపు మాట్లాడతాడు.తర్వాత రాంప్‌ని తీసి కారులో పెడతాడు.“నేను ఏడవడం లేదు, నువ్వే ఏడుస్తున్నావు” అనే క్యాప్షన్‌తో ఈ వీడియో ఎక్స్‌ ప్లాట్‌ఫాంలో షేర్ చేశారు.

వీడియోకు 60 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.చాలా మంది హృదయాలను తాకింది.నెటిజన్లు ఈ హార్ట్ సన్నివేశాన్ని చూసి ఎంతగానో ఎమోషనల్ అయినట్లు తెలుస్తుంది.ఒక వ్యక్తి జీవితంలో మంచి స్నేహితులు( Friends ) ఉంటేనే బాగుంటుందని, మరొకరు ఈ అందమైన క్షణాన్ని ఎంతో ఇష్టపడ్డారని వ్యాఖ్యానించారు.

మరొక వృద్ధుడూ,( Elderly Man ) అతని కుక్కా కలిసి ముసలి వాళ్లు అవుతున్నారని గమనించారు. “నిజమైన ప్రేమ”( True Love ) అని మరొకరు ఎమోషనల్ గా కామెంట్ పెట్టారు.వృద్ధుడు తన ముసలి కుక్కకు సహాయం చేయడం అంటే, ఒక వృద్ధుడు మరొక వృద్ధుడికి సహాయం చేయడం లాంటిదే అని పోల్చారు.ఈ వీడియో చూసి ఎంతో సంతోషంగా ఉన్నట్లు ఒక వ్యక్తి చెప్పారు, వృద్ధుడు, అతని కుక్కా ఇద్దరూ ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలని కోరుకున్నారు.

మరొక వ్యక్తి వృద్ధుడు చూపించిన గౌరవం, కేర్ ను ప్రస్తావించారు.ఆ కుక్క జీవితాంతం అతని పక్కనే ఉండిందని, ఇప్పుడు అతను దానికి తిరిగిచ్చేస్తున్నాడని చెప్పారు.

తమ పెంపుడు జంతువులతో కలిసి ముసలి దాన్ని అవ్వాలని, కలిసి సూర్యాస్తమానాన్ని చూడాలని మరొకరు తమ ఆశను పంచుకున్నారు.ఇది ఫారిన్ కంట్రీలో జరిగినట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube