వామ్మో, ఈ పాము స్కూటర్‌లో ఎక్కడ నక్కిందో చూస్తే..!

ప్రస్తుతం ఇండియాలో వానకాలం నడుస్తోంది.ఈ కాలంలో పాములు( Snakes ) వెచ్చదనం కోసం ఇళ్లు, టాయిలెట్స్‌, ఇంకా వాహనాల్లోకి చొరబడుతున్నాయి.

 , If You See Where This Snake Licked The Scooter , Python, Scooter's Petrol Tank-TeluguStop.com

ఈ ప్రాంతాలను చెక్ చేయకుండా తిరిగితే పాము కాటుకు గురయ్యే ప్రమాదం ఎక్కువ.ఈ స్నేక్స్‌ ఎంత తెలివిగా దక్కుంటాయో తెలిపే వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ మారింది.

ఒక స్కూటర్( Scooter) పెట్రోల్ ట్యాంక్ చుట్టూ పైథాన్ చుట్టేసుకున్న వీడియో సోషల్ మీడియా( Social media )లో చక్కర్లు కొడుతోంది.ఈ సంఘటన ఎక్కడ జరిగిందో, ఎప్పుడు జరిగిందో తెలియదు, కానీ వీడియోలోని వ్యక్తులు మలయాళం మాట్లాడుతున్నారు.దాన్ని బట్టి ఈ ఘటన భారతదేశంలోని కేరళలో జరిగిందని తెలుస్తోంది.సాలిహ్త్ ముల్లాంబత్ అనే వ్యక్తి ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు, దీనికి ఆన్‌లైన్‌లో భారీ స్పందన వచ్చింది.

ఈ అనూహ్యమైన దృశ్యం చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు.చాలామంది భయపడ్డారు.

వీడియో ఓపెన్ చేయగానే ఒక వ్యక్తి పొడవైన కర్రతో స్కూటర్ సీటును జాగ్రత్తగా ఎత్తి చూపించడం కనిపిస్తుంది.దీంతో స్కూటర్ పెట్రోల్ ట్యాంక్ చుట్టూ ఒక పాము చుట్టేసుకున్నట్లు కనిపిస్తుంది.ఈ వీడియో వాహనం లోపల ఒక చిన్న స్థలాన్ని ఎంచుకుని దొంగతనంగా దాక్కున్న పామును చూపిస్తుంది.అది అక్కడికి ఎలా వెళ్లిందో కానీ అది అక్కడే ఉందని ఎవరూ ఊహించలేరు.

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 70 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి, ఆ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది.ఈ ఆశ్చర్యకరమైన కానీ షాకింగ్ వీడియోపై చాలా మంది యూజర్లు వ్యాఖ్యలు చేశారు.“పెట్రోల్ ట్యాంక్‌లో పెట్రోల్ ఉందో లేదో చూడటానికి పాము వచ్చిందేమో!” అని ఒక వ్యక్తి వ్యాఖ్యానించాడు.“ఇది ఒక భారతీయ రాక్ పైథాన్ (పెరుం పాము), ఇది విషపూరితం కాదు” అని మరొక వ్యక్తి రాశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube