సినిమా రంగం చిత్ర విచిత్రాలు చేస్తుంది.హీరోయిన్ గా రాణించాలంటే కరెంటు తీగలా సన్నగా ఉండాలని.
హీరోగా అదరగొట్టాలంటే కండలు తిరిగిన దేహంతో పాటు సిక్స్ ప్యాక్ తప్పనిసరి అనేది పాత చింతకాయ పచ్చడి మాటలు మాత్రమే.ఒళ్లు పెద్దగా ఉన్నా.
భారీ దేహంతో కనిపించినా.నటనలో దమ్ముంటే సక్సెస్ వెతుక్కుంటూ వస్తుంది.అసాధారణ బరువుతో అంతే స్థాయిలో నటన కనబర్చి వారెవ్వా అనిపించిన నటీనటులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
*అనుష్క
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది బొద్దుగుమ్మ అనుష్క.బాహుబలి సినిమాతో తన సత్తాను ప్రపంచ వ్యాప్తంగా చాటుకుంది.అదే సమయంలో సైజ్ జీరో సినిమా చేసింది.ఈ సినిమా కోసం ఓ సరికొత్త ప్రయోగం చేసింది.స్లిమ్, ఫిట్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.
భారీగా బరువు పెరిగింది.ఆ తర్వాత బరువు తగ్గేందుకు చాలా కష్టపడింది.
అయినా మామూలు సైజులోకి రాలేకపోయింది.బరువు బాగా పెరిగినా.తను మాత్రం టాప్ హీరోయిన్ గా కొనసాగుతూనే ఉంది.
*కృష్ణుడు
కమెడియన్ గా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాడు కృష్ణుడు.కొద్ది రోజుల్లోనే చక్కటి నటనతో హీరోగా మారిపోయాడు.వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు సహా పలు సినిమాల్లో నటించాడు.
ఈ రెండు సినిమాలు విజయం సాధించడంతో మంచ క్రేజ్ సంపాదించుకున్నాడు.ఓ వైపు హీరోగా కొనసాగుతూనే మరోవైపు కమెడియన్ గా రాణిస్తున్నాడు కృష్ణుడు.
*గీతా సింగ్
అటు బొద్దుగా ఉండే గీతా సింగ్ సైతం మంచి నటిగా రాణిస్తుంది.తన భారీ శరీరంతోనే కితకితలు సినిమా చేసి అందరిలో కితకితలు పెట్టించింది.ఈ సినిమాతో ఓ రేంజిలో క్రేజ్ సంపాదించుకుంది.తన బరువు తగ్గించుకోవాలని ఏనాడూ ప్రయత్నించలేదు ఈ ముద్దుగుమ్మ.తన నటనకు శరీర రూపం అస్సలు అడ్డుకాదని నిరూపించింది.ఆ తర్వాత చక్కటి కామెడీ రోల్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.
*విద్యుల్లేఖా రామన్
ఈ బొద్దుగుమ్మ కూడా మంచి కామెడీ ఆర్టిస్టుగా రాణిస్తుంది.సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షో చేసి.మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఈ దెబ్బతో ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి.ప్రస్తుతం స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న ఈమె వ్యాపారవేత్త సంజయ్ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించింది.త్వరలో వీరు మూడుముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు.