భారతీయుడు2 మూవీ ట్రైలర్ లో ఇది గమనించారా.. ఆ ముగ్గురికీ ఈ సినిమా చివరి సినిమానా?

సౌత్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో శంకర్( Shankar ) ఒకరు.ఈయన దర్శకత్వంలో కమల్ హాసన్( Kamal Haasan ) హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం భారతీయుడు.

 Kamal Haasan Indian 2 Is The Last Movie For The Actors Manobala Nedumudi Venu An-TeluguStop.com

అప్పట్లో ఈ సినిమా ఎలాంటి సంచలనాలను అందుకుందో మనకు తెలిసిందే.ఇలా భారతీయుడు సినిమా ఎంతో అద్భుతమైన విజయం అందుకోవడంతో ఈ సినిమా విడుదలైన రెండు దశాబ్దాలకు భారతీయుడు 2( Indian 2 ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

నిజానికి ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండేది కానీ డైరెక్టర్ శంకర్ కి లైకా ప్రొడక్షన్ వారితో ఉన్న విభేదాలు కారణంగా ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది అయితే కోర్టులో ఈ సమస్య పరిష్కారమైన అనంతరం తిరిగి సినిమా షూటింగ్ పనులు ప్రారంభమయ్యాయి.ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ క్రమంలోనే ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు ఈ ట్రైలర్లో భాగంగా మరణించిన ముగ్గురు నటులు కనిపించటం గమనార్హం.

ఇలా ముగ్గురి నటులకు భారతీయుడు 2 సినిమా ఆఖరి చిత్రంగా నిలిచిపోయింది.మరి ఆ ముగ్గురు నటులు ఎవరు అనే విషయానికి వస్తే.మనోబాల,( Manobala ) నెడుముడి వేణు( Nedumudi Venu ) , వివేక్( Vivek ) ముగ్గురూ ఈ చిత్రం షూటింగ్ దశలో ఉన్నప్పుడే కన్నుమూశారు.

దీంతో భారతీయుడు 2 వీరికి చివరి చిత్రమైంది.అయితే ఇందులో నెడుముడి వేణు, వివేక్ పాత్రల విషయంలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించారని తెలుస్తోంది.ఇక ఇటీవల విడుదల చేసిన ఈ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది.ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ నటించిన ఆమె పాత్రను ఎడిట్ చేసినట్టు సమాచారం ఇక్కడ రకుల్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమైన సంగతి మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube