ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయటం తెలిసిందే.ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 16 వైసీపీ కార్యాలయాలకు( YCP Offices ) అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయాలు నిర్మించారని.ఆ కార్యాలయాలను ఎందుకు కూల్చకూడదో వివరణ ఇవ్వాలంటూ అధికారులు వైసీపీకి నోటీసులు ఇవ్వడం జరిగింది.
ఈ నోటీసులపై వైసీపీ హైకోర్టును( High Court ) ఆశ్రయించింది.దీనిలో భాగంగా బుధవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.
గురువారం వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానంలో విచారణ ముగిసింది.
ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు.ఇదే సమయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఈ కేసుకు సంబంధించి తీర్పు వచ్చేవరకు వైసీపీ కార్యాలయాలకు కూల్చివేతలపై స్టేటస్ కో కొనసాగుతుందని ఆదేశించడం జరిగింది.16 వైసీపీ కార్యాలయాలకు ఈ స్టే స్టేటస్ కో వర్తిస్తుందని స్పష్టం చేయడం జరిగింది.కాగా ఇప్పటికే చాలా చోట్ల వైసీపీ కార్యాలయాలను కూల్చివేయడం జరిగింది.
రాష్ట్రంలో ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిన వెంటనే వైసీపీ పార్టీ కార్యాలయాల కూల్చివేత ఘటనలు రాజకీయాల్లో కాక రేపుతున్నాయి.అయితే అనుమతులు లేకుండా నిర్మించారంటూ అందువల్లే చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇటువంటి పరిస్థితులలో వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి( Lella Appi Reddy ) బుధవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ క్రమంలో ఈ కేసుకి సంభందించి ఇరు వాదనలు విని తీర్పును హైకోర్టు రిజర్వ్ చేయడం జరిగింది.