నటిస్తున్న సినిమా కోసం ఎన్నో ఆఫర్స్ వదులుకున్న స్టార్స్ వీళ్ళే !

ఎవరైనా ఒక సినిమాలో పని చేస్తున్న సమయంలో మరో సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది.ఇక కాస్త ఫామ్ లో ఉన్న నటీనటులు అయితే చెప్పాల్సిన అవసరం లేదు.

 Tollywood Actors Who Left Movies For One Movie Prabhas Bobby Simha Srinidhi Shet-TeluguStop.com

వారు ఏకకాలంలో ఎక్కువ షూటింగ్స్ లో పాల్గొనాల్సి వస్తుంది.అయినా కూడా కొన్ని సినిమాలను మిస్ చేసుకుంటారు.

సమయం సరిపోక కొన్ని మంచి సినిమాలు కూడా వదిలేసుకోవాల్సి వస్తుంది.ఎందుకంటే అప్పటికే కమిట్ అయిన సినిమాలకు టైం ఇవ్వడం ప్రియారిటీ గా పెట్టుకుంటారు కాబట్టి.

అయితే అలా ఒక సినిమా కోసం పని చేస్తున్న క్రమంలో ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చినా కూడా తిరస్కరించిన వారు ఉన్నారు.మరి ఆ నటీనటులు ఎవరు వారు నటించినా ఆ ఒక్క సినిమా కోసం ఏం వదులుకున్నారు ? అనే విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ప్రభాస్

Telugu Actors, Actors Offers, Bahubali, Bobby Simha, Jigarthanda, Jill, Nayak, P

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా( Bahubali ) కోసం ప్రభాస్( Prabhas ) హీరోగా నటించారు.ఈ సినిమాలో ప్రభాస్ తప్ప మరో నటుడు కూడా నటించలేడు అంటూ రాజమౌళి చెప్పడం విశేషం.దాదాపు బాహుబలి మరియు దాని సిక్వెల్ సినిమాలు పూర్తి అయ్యే సరికి ఐదేళ్ల టైం పట్టిందట.అప్పటి వరకు మిగతా ఆర్టిస్టులు అందరూ ఎన్నో సినిమాల్లో నటించారు.కానీ కేవలం బాహుబలి సినిమాల కోసమే ప్రభాస్ నాయక్, జిల్ వంటి చిత్రాలను వదులుకున్నారు.

బాబి సింహ

Telugu Actors, Actors Offers, Bahubali, Bobby Simha, Jigarthanda, Jill, Nayak, P

తమిళ స్టార్ హీరోలలో ఒకడైన బాబి సింహ( Bobby Simha ) జిగర్తాండ సినిమాలో నటించే టైంలో ఆయనకు ఏకంగా పది సినిమా ఆఫర్స్ వచ్చాయట.అయితే జిగర్తాండ సినిమా( Jigarthanda ) ఘనవిజయం సాధిస్తుందని దాని తర్వాత కూడా తనకు గొప్ప సినిమా ఆఫర్స్ వస్తాయని ముందే ఊహించిన బాబు ఆ సినిమాలను వదులుకున్నాడట.

శ్రీనిధి శెట్టి

Telugu Actors, Actors Offers, Bahubali, Bobby Simha, Jigarthanda, Jill, Nayak, P

కేజిఎఫ్( KGF ) సినిమాల్లో నటించిన శ్రీనిధి శెట్టి( Srinidhi Shetty ) మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది.ఈ సినిమా ద్వారా ఆమెకు దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ వచ్చింది.అయితే కేజిఎఫ్ మొదటి భాగంలో నటించిన తర్వాత ఆమెను రెండో భాగం కోసం కూడా దర్శకుడు కాల్ షీట్స్ తీసుకున్నారట.

అయితే మొదటి భాగం తర్వాత ఆమెకు ఎన్నో సినిమా ఆఫర్స్ వచ్చినప్పటికి రెండవ పార్ట్ పూర్తయ్యేంత వరకు కూడా ఆమె ఎదురు చూడాల్సి వచ్చింది.ఆ మధ్యకాలంలో అనేక సినిమాలు ఆమె మిస్ చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube