కెమికల్స్ ఎక్కువగా ఉండే లిప్ స్టిక్స్‌ను వాడటం, మాయిశ్చరైజర్స్‌ను ఎవైడ్ చేయడం, ఎండల ప్రభావం, మృతకణాలు పేరుకుపోవడం, డీహైడ్రేషన్ వంటి రకరకాల కారణాల వల్ల పెదాలు నిర్జీవంగా, అందవిహీనంగా మారిపోతుంటాయి.దాంతో మళ్లీ పెదాలను అందంగా మార్చుకునేందుకు నానా పాట్లు పడుతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలను పాటిస్తే క్షణాల్లో నిర్జీవంగా మారిన పెదాలను ఆకర్షణీయంగా మెరిపించుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ పౌడర్, మూడు టేబుల్ స్పూన్ల బాదం ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసి.
సున్నితంగా వేళ్లతో రెండు నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి.ఆపై గోరు వెచ్చని నీటితో శుభ్రంగా పెదాలను క్లీన్ చేసుకుని.
మంచి లిప్ బామ్ ను రాసుకోవాలి.ఇలా చేస్తే నిర్జీవంగా మారిన పెదాలు క్షణాల్లో మెరుస్తాయి.
అలాగే ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు పెద్ద దాల్చిన చెక్కలు, నాలుగు లవంగాలు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్‌లో వన్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క, లవంగాల పొడి వేసుకోవాలి.అలాగే అందులో వన్ టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన తేనె, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని స్పూన్‌తో బాగా మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసి.
ఒక నిమిషం పాటు వదిలేయాలి.అనంతరం మునివేళ్లతో స్మూత్‌గా రబ్ చేసుకుంటూ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.
పెదాలు నిర్జీవంగా ఉన్నప్పుడు ఈ సింపుల్ చిట్కాను ప్రయత్నించినా మంచి ఫలితం ఉంటుంది.







