కృష్ణంరాజు నట వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రభాస్( Prabhas ) మొదటి సినిమా ఈశ్వర్ నుంచి నేటి కల్కి వరకు విభిన్నమైన పాత్రతో అనేక రకాల ప్రయోగాలతో తన కెరీర్ ను మలుచుకుంటూ వెళుతున్నాడు.మొదటి ఒకటి రెండు సినిమాలు పరవాలేదు అనిపించిన ఆ తర్వాత వర్షం సినిమాతో( Varsham ) టాలీవుడ్ కి ఒక స్టార్ హీరో దొరికాడు అని అందరూ అనుకునేలా చేసాడు ప్రభాస్.
ఆ తర్వాత మళ్లీ పరాజయాలు పలకరించినప్పటికి ఎక్కడ వెనకడుగు వేయలేదు.రాజమౌళి దర్శకత్వంలో చత్రపతి( Chatrapati ) సినిమాతో తనలోని మాస్ యాంగిల్ ఏంటో దిమ్మ తిరిగిపోయేలా ప్రతి ఒక్కరికి చూపించాడు.
ఒక్క అడుగు అంటూ తన చెప్పిన డైలాగ్ ఇప్పటికీ చాలామంది ప్రేక్షకుల చెవుల్లో మారు మ్రోగుతూనే ఉంటుంది.
చత్రపతి సినిమా ప్రభావము లేక స్టోరీస్ ఎలక్షన్స్ లో ఇబ్బంది పడ్డాడో తెలియదు కానీ ఆ తర్వాత వచ్చిన మున్న, యోగి, ఏక్ నిరంజన్, బిల్లా చిత్రాలు ప్రభాస్ కెరియర్ ను ప్రశ్నార్ధకంగా మార్చే ప్రయత్నం చేయగా డార్లింగ్ సినిమాతో( Darling Movie ) మళ్ళీ కం బ్యాక్ చేశాడు ప్రభాస్.ఒకసారి లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకొస్తే మరోసారి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో జనాలను మెప్పిస్తాడు.ఒకసారి బోల్తా కొడితే మరోసారి ఉవ్వెత్తిన ఎగిసిపడిన అలలా ముందుకు వస్తాడు.
డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు హిట్ అయిన ఆ తర్వాత వచ్చిన రెబల్ బోల్తా కొట్టిన మిర్చి సినిమాతో మరోసారి నిలదొక్కుకున్నాడు.ఇక ఆ తర్వాత వచ్చింది బాహుబలి.
బాహుబలి 2( Bahubali 2 ) పార్టుల ఏకంగా ఐదు ఏళ్ల సమయం ఇచ్చాడు.ఒకవేళ కనుక ఈ సినిమా అయితే కష్టంతో పాటు కెరియర్ కూడా పూర్తిగా కోల్పోవాల్సి వచ్చేది.ఎందుకంటే ఈ సినిమా కోసం తన శరీరాన్ని ఏ హీరో కష్టపెట్టని విధంగా మార్చుకున్నాడు.ఇక బాహుబలి రెండు పార్ట్స్ సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత సాహూ( Saaho ) అనే పరాజయాన్ని మూట కట్టుకున్నాడు.
ఇక ఆ తర్వాత వచ్చిన రాధే శ్యామ్, ఆది పురష్ తనలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేసిన సలార్ సినిమా( Salaar ) నేనున్నాను అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కి ధైర్యాన్ని నింపింది.ఇక ఇప్పుడు మరోసారి నీ ప్రపంచ వ్యాప్తంగా హాలీవుడ్ హీరోలకు దీటుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది.
దీనికి కూడా సీక్వెల్ రాబోతుంది.అలాగే సలార్ సీక్వెల్ కూడా ఉన్న విషయం మనకు తెలిసిందే.
ఇవి కాకుండా స్పిరిట్ రాజా సాబ్ వాటి సినిమాలు కూడా సిద్ధమవుతున్నాయి.ఇక ముందు ముందు తనకు ఎదురు ఎవ్వరూ లేరు అనే విషయాన్ని మరోసారి చెప్పే ప్రయత్నం చేశాడు ప్రభాస్.