ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రభాస్ నటించిన కల్కి సినిమా గురించి డిస్కషన్ జరుగుతుంది ఈ సినిమా బడ్జెట్ 750 కోట్లు కాగా అందులో ఏకంగా 250 కోట్ల రూపాయలను రెమ్యూనరేషన్ కోసమే ఉపయోగించారట 400 కోట్ల రూపాయలు సినిమా కోసం వాడుకున్నారట డైరెక్టర్ నాగ్ అశ్విన్( Nag Ashwin ) ఓకే సినిమా కోసం ఇంత బడ్జెట్ పెట్టడం వైజయంతి మూవీస్ వారికి మొదటిసారి కావడం కూడా విశేషం.అయితే ఎంత ఖర్చైనా పర్వాలేదు అని బడ్జెట్ కోసం ఎక్కడ వెనకాడ లేదట స్వప్న దత్.
అందుకే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి అంటూ అమితాబ్ మరియు కమల్ హాసన్ పొగడటం విశేషం.మరి ఈ సినిమాలో నటించిన నటినటులకు ఎంత పారితోషకం ఇచ్చారో తెలుసా? ఆ వివరాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఈ సినిమాలో ప్రభాస్ కి ఇచ్చిన బడ్జెట్ దాదాపు 15 నుంచి 20 చిన్న సినిమాల బడ్జెట్ అని చెప్పుకోవచ్చు.150 కోట్ల రూపాయలను ప్రస్తుతం పారితోషకంగా అందుకుంటున్నాడు ప్రభాస్( Prabhas ).కేవలం ఈ సినిమాకు మాత్రమే కాదు ఆయన ప్రతి సినిమాకి ఇంతకన్నా తగ్గేదేలే అంటూ వెళుతున్నాడు.ఇక అమితాబ్ ఇందులో చేసిన పాత్ర చిన్నది అయినా 15 కోట్ల రూపాయల పారితోషకాన్ని అందుకున్నాడట.
అలాగే కమల్ హాసన్ సైతం ఈ సినిమా కోసం 18 కోట్ల వరకు తీసుకున్నాడట.ఇక హీరోయిన్ దీపికా పదుకొనే కూడా 15 కోట్ల రూపాయలు పారితోషకంగా తీసుకోవడం కోస మెరుపు.

మీరు మాత్రమే కాదు చిన్న పాత్రల్లో నటించిన మాళవిక నాయర్ (Malvika Nair )వంటి హీరోయిన్ ఏకంగా 30 లక్షల రూపాయలను చార్జ్ చేసిందట.ఇలా 250 కోట్ల రూపాయలను పారితోషకంగా వాడేసారు నాగ్ అశ్విన్.మరి ఈ సినిమా విడుదల ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు.గతంలో ఆయన నటించిన సలార్ సినిమా మినహా అంతకు ముందు నటించిన సినిమాలన్నీ కూడా పరాజయం పాలయ్యాయి.
మరి అపజయమంటూ ఎరుగని నాగ్ అశ్విన్ ప్రభాస్ తో ఎలాంటి మ్యాజిక్ చేశాడో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.







