వైరల్ వీడియోస్: నడిరోడ్డుపై జాంబీస్ లా మారిపోతున్న పంజాబీలు.. డ్రగ్సే కారణమా..?

ఈ మధ్యకాలంలో భారతదేశ వ్యాప్తంగా ఎన్నో మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసులు పట్టుబడిన సంఘటనలు తరచూ తెలుసుకుంటూనే ఉన్నాము.ఇలా మాదకద్రవ్యాలను పట్టుబడిన వారు జైల్లో ఊచలు లెక్క పెడుతుండగా వాటికి బానిసలైన వాళ్ళు మాత్రం నరకయాతన అనుభవిస్తున్నారు.

 Punjabis Are Turning Into Zombies On The Road Is It Because Of Drugs, Drugs, Vir-TeluguStop.com

ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పోలిస్తే ఉత్తర భారత దేశంలో ఈ కల్చర్ మరి ఎక్కువగా అయింది.చాలా మంది పార్టీలలో ఈ డ్రగ్స్ (drugs)తీసుకోవడం పరిపాటిగా మారింది.

మర కొందరైతే డ్రగ్స్ బానిసలుగా మారడంతో కొందరు అఘాయిత్యాలకు కూడా పాల్పడుతున్నారు.ఇకపోతే ప్రస్తుతం డ్రగ్స్ కు అలవాటు పడి నడిరోడ్డుపై విచిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

వీటికి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

పంజాబ్ లోని కొంతమంది వ్యక్తులు మాదకద్రవ్యాలు అధిక మోతాదులో తీసుకోవడం కారణంగా వారు నడిరోడ్డుపై చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ సినిమాల్లో చూపించిన జాంబీస్(zombies) లాగా ప్రవర్తిస్తున్నారు.ఇలాంటి వారికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.నడిరోడ్డుపై వారు వచ్చినప్పుడు వారు చివరికి నిలబడటానికి కూడా కష్టపడుతున్నారు.

అలాగే నడవడానికి కూడా ఇబ్బందులు పడిపోతున్న వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియోలను బట్టి చూస్తే.

పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్(state of Punjab drugs) వాడకం ఏ రేంజ్ లో ఉందో ఇట్లే అర్థమవుతుంది.

దీంతో డ్రగ్స్ వాడకంపై ఆందోళనను రేకెత్తిస్తున్నాయి.నడిరోడ్డుపై మహిళలు, పురుషులని తేడా లేకుండా దిక్కుతోచని స్థితిలో డ్రగ్స్ కోసం వెతుకుతున్నట్లుగా అక్కడ కనబడుతుంది.ఇక ఈ వీడియోను చూస్తే కొందరు చేసిన పనికి మాదకద్రవ్య దుర్వినియోగం తీవ్రత ప్రభావాన్ని చూపిస్తుంది.

ఇక తాజాగా అమృత్సర్ (Amritsar)నగరంలోని పలు చోట్ల డ్రగ్స్ తీసుకున్న వారి పాట్లకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి.తాజాగా ఓ అమ్మాయి డ్రగ్ మత్తులో నడిరోడ్డుపై అటు నిలబడలేక, అటు కూర్చోలేక జాంబి లాగా ప్రవర్తించిన తీరు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇప్పుడైనా ఆ రాష్ట్రంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube