కొరియన్ సినిమాలు ( Korean movies )వెబ్ సిరీస్ లకు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ పెరిగిపోతుంది.భారతీయుల్లో కూడా చాలామంది వీటికి ఫ్యాన్స్ అయిపోయారు.
కొరియన్ సంస్కృతి, భాషపై ఆసక్తి కూడా పెరుగుతోంది.ఇటీవల ఒక నాలుగు సంవత్సరాల ఎన్నారై బాలుడు కొరియన్ భాష అనర్గళంగా మాట్లాడుతూ ఆశ్చర్యపరిచాడు.
అతను కొరియన్, మలయాళం భాషల్లో అద్భుతంగా మాట్లాడుతూ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించాడు.కేరళకు( Kerala ) చెందిన తల్లి, దక్షిణ కొరియాకు చెందిన తండ్రికి జన్మించిన ఈ బాలుడు రెండు భాషల మధ్య సులభంగా మారుతూ తన ద్విభాషా నైపుణ్యాలను ప్రదర్శిస్తాడు.
అతని తల్లి పంచుకున్న ఒక వైరల్ వీడియోలో, అతను తన తండ్రితో కొరియన్‌లో మాట్లాడుతూ, అతను వంట చేస్తున్నప్పుడు చూస్తున్నట్లు కనిపిస్తాడు.తరువాత, అతను తన తల్లిని ఆక్టోపస్( Octopus ) ఎలా తినాలో చెప్పాలని మలయాళంలో అడుగుతాడు.
అతని తల్లి మలయాళంలో స్పందిస్తూ, దానిని ఉడికించిన తర్వాత తినవచ్చని వివరిస్తుంది.
ఈ అబ్బాయి ముందుగా మలయాళం నేర్చుకున్నాడు.రెండేళ్ల వయసుకే అతను దానిలో పూర్తిగా మాట్లాడేయగలగుతున్నాడు.తర్వాత డే కేర్ కి వెళ్ళాక కొరియన్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు.
చిన్న వయసులోనే ఇలా రెండు భాషలు మాట్లాడగలగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.అతని వీడియో చాలా ఫేమస్ అయ్యింది.
చాలా మంది దానిని చూసి, బాగుందన్నారు.కొంతమంది అయితే సినిమాలు చూసేటప్పుడు కూడా ఈ బాలుడు సబ్ టైటిల్స్ లేకుండా చూడగలడం అద్భుతం అన్నారు.
మరికొంతమంది అతను మలయాళం మాట్లాడేటం చాలా ముద్దుగా ఉందని, అలాగే రెండు భాషల్లోనూ అతని యాస చాలా సహజంగా ఉందని చెప్పారు.
“ఈ బాలుడు 18 ఏళ్ళు వచ్చాక కేరళకు వస్తే, ఫేమస్ కొరియన్ పాప్ బ్యాండ్ అయిన BTS ఫ్యాన్స్ లో చాలా పాపులర్ అయిపోతాడు” అని ఒక వ్యక్తి సరదాగా ఊహించాడు.ఇంకొకరు ఈ బాలుడు ఎంతో సునాయంగా భాషలు మార్చేస్తున్నాడని మెచ్చుకున్నారు.ఈ వీడియో అప్‌లోడ్ చేసినప్పటి నుంచి 2 మిలియన్ కంటే ఎక్కువ వీక్షలు రాబట్టింది.
ఇది అతని ద్విభాషా నైపుణ్యాలు, అందమైన వ్యక్తిత్వంపై ప్రజల ఆసక్తిని చూపిస్తుంది.కొరియా సంస్కృతి భారతదేశంలో చాలా మందిని ఆకర్షిస్తూనే ఉంది.అదేవిధంగా దక్షిణ కొరియాలో కూడా భారతీయ భాషలు, సంస్కృతిపై ఆసక్తి ఉంది.ఉదాహరణకు, కొరియన్ కంటెంట్ క్రియేటర్ యేచన్ లీ హిందీ, బిహారీ భాషల్లో ఫ్లూయెంట్‌గా మాట్లాడుతూ వీడియోలు చేసి ఫేమస్ అయ్యాడు.