పూర్వకాలంలో మధుమేహం అంటే పెద్దగా ఎవరికీ తెలిసేది కాదు.కానీ ప్రస్తుత రోజుల్లో కోట్లాదిమంది మధుమేహానికి బాధితులుగా ఉన్నారు.30 ఏళ్ల వారు సైతం మధుమేహం బారిన పడుతూ ముప్పతిప్పలు పడుతున్నారు.మారిన జీవనశైలి, శరీరానికి శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, నిద్రను నిర్లక్ష్యం చేయడం, అధిక బరువు వంటి అంశాలు మధుమేహానికి ప్రధాన కారణాలు.
అలాగే కొందరికి వంశపారపర్యంగా కూడా మధుమేహం వస్తుంది.ఏదేమైనా ఒక్కసారి మధుమేహం వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సి ఉంటుంది.
అలాగే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.అందుకే మధుమేహం వచ్చాక బాధపడటం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.
అయితే మధుమేహం వచ్చే రిస్క్ ను తగ్గించడానికి కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.అటువంటి వాటిలో ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ కూడా ఒకటి.
ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకుంటే మధుమేహానికి దూరంగా ఉండొచ్చు.మరి ఇంతకీ ఆ జ్యూస్ ఏంటి.
దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక చిలకడదుంప ని తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి తొక్క తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక ఆరెంజ్ పండును తీసుకుని తొక్క తొలగించి లోపల ఉండే పల్ప్ ను సపరేట్ చేయాలి.చివరిగా ఒక క్యారెట్ ను కూడా తీసుకుని వాటర్ తో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండర్‌లో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, చిలకడదుంప ముక్కలు మరియు ఆరెంజ్ పల్ప్ వేసుకోవాలి.
అలాగే ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి సేవించాలి.వారంలో మూడు సార్లు ఈ జ్యూస్ ను తీసుకుంటే మధుమేహం వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుంది.
మధుమేహానికి దూరంగా ఉండాలని భావించేవారు తప్పకుండా ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోండి.పైగా ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది.
గుండె పనితీరు మెరుగుపడుతుంది.ఊబకాయం బారిన పడకుండా ఉంటారు.
ఎముకలు కండరాలు దృఢంగా సైతం మారతాయి.