కోలీవుడ్లో హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో విజయ్, త్రిష( Vijay, Trisha ) జంట కూడా ఒకరు.వీరిద్దరూ ఇప్పటివరకు దాదాపు నాలుగు సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాలన్నీ కూడా మంచి విజయం సాధించాయి.వాటిలో గిల్లి సినిమా కూడా ఒకటి.
సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.ఇకపోతే చివరిగా విజయ్ లియో సినిమా( Leo movie )తో ప్రేక్షకులను పలకరించడంతో పాటు ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు.
ప్రస్తుతం విజయ్ రాజకీయాలలో ఫుల్ బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే.
మరోవైపు త్రిష కోలీవుడ్ బాలీవుడ్ అని సంబంధం లేకుండా వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.ఇది ఇలా ఉంటే విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత త్వరలో సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో తన చివరి సినిమాలో కూడా త్రిషనే హీరోయిన్‌గా ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి.కానీ, అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
కానీ కొద్దిరోజుల క్రితం విజయ్ తన 50వ పుట్టినరోజు( Vijay birth day ) జరుపుకున్నారు.ఈ క్రమంలో త్రిష ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ వారిద్దరూ లిఫ్ట్‌లో ఉన్న ఒక ఫోటోను పంచుకుంది.
ఆపై నీ థాన్ ఎన్ కాదల్.టిల్ డెత్ నీ థన్ ఎన్ కాదల్ అంటూ ఒక ఆంగ్ల పాటను కూడా పోస్ట్ చేసింది.ప్రస్తుతం అది నెట్టింట వైరల్ గా మారింది.ఈ ఫోటో వైరల్ అవుతున్న సమయంలో త్రిష, విజయ్ కలిసి ఉన్న ఫోటోలు అంటూ నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.
చాలా సందర్భాల్లో వీరిద్దరూ కలిసే విదేశాలకు వెళ్లారంటూ వారు తెలుపుతున్నారు.అందుకు రుజువుగా ఒక పాత ఫోటోను వారు వైరల్ చేస్తున్నారు.అందులో విజయ్ ఒంటరిగా నడుస్తున్న ఫోటో ఒకటి ఉంది.మరో ఫోటోలో త్రిష పక్కన ఒక కాలుతో ఉన్న ఫోటో ఉంది.
ఈ రెండూ కలిపి ఇప్పుడు కొందరు నెట్టింట వైరల్ చేస్తున్నారు.ఆ ఫోటోలలో విజయ్ ధరించిన షూ ఏదైతే ఉందో అదే త్రిష కూర్చున్న పక్కనే కనిపిస్తుంది.
దీంతో విజయ్, త్రిష తరచూ విదేశాలకు వెళ్లారని పలువురు కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వారిద్దరి మధ్య రహస్య బంధం ఏమైనా నడుస్తుందా అంటూ కోలీవుడ్లో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.