యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం( Narayanapoor ) మండలం కంకణాలగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని శేరిగూడెంలో మహిళలు వర్షాల కోసం మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.వర్షా కాలంలో వర్షాలు( Rains ) బాగా కురిసి,పంటలు బాగా పండాలని గ్రామ బొడ్రాయికి పసుపు కుంకుమతో అలంకరించిన బిందెల్లో నీళ్ళు తెచ్చి పోస్తూ మొక్కులు తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ వాన దేవుడు కరుణించి వర్షాలు పడాలని మొక్కులను తీర్చుకున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ సరిపెల్లి శైలజ, సత్యనారాయణ,ప్రజ్ఞా నాయక్,తుమ్మల శ్రీనివాస్ రెడ్డి,కడ్తలభిక్ష్మయ్య,నర్సింహ,గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.