గీత కాదంబి( Geeta Kadambi ).ఈమె 80’s లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్.
అయితే ఈమె తన సమకాలికులు అయినా జయసుధ, జయప్రద, శ్రీదేవి అంత స్టార్ హీరోయిన్ మాత్రం అవ్వలేకపోయింది.భైరవి( Bhairavi ) అనే సినిమాతో 1978 లో తొలిసారిగా టైటిల్ లో రోల్ లో రజినీకాంత్ కి చెల్లెలిగా నటించి సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత దాదాపు ఒక 2 దశాబ్దాల వరకు చాల బిజీ గా సినిమాల్లో నటించి దక్షిణ భాషల్లో దాదాపు 200 వరకు చిత్రాల్లో నటించి 1998 లో ఒక అమెరికన్ వ్యక్తిని పెళ్లి చేసుకొని ఒక కుమారుడికి జన్మనిచ్చి దాదాపు అక్కడే ఇరవైఏళ్ళ పాటు స్థిరపడి పోయారు.ఆ తర్వాత ఆమె కురుడు ఉద్యోగంలో సెటిల్ అయ్యాక తన రెండవ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టి క్యరెక్టర్ ఆర్టిస్ట్ గా మరొకసారి నటిగా బిజీ అయ్యారు.
ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తాను ఎందుకు తన తోటి నటీమణుల లాగ స్టార్ హీరోయిన్ అవ్వలేకపోయాను అనే విషయాన్ని పంచుకున్నారు.తనకు నటించడం లో ఎలాంటి సమస్య లేదు అని కానీ కేవలం రాధికా, శ్రీదేవి వంటి హీరోయిన్స్ లాగ డ్యాన్స్ చేయడం తన వాళ్ళ కాలేదని, తాను డ్యాన్స్ చేయాలనీ చుసిన ప్రతిసారి పేడలో కాలు పెట్టి ఎలా అయితే ఇబ్బంది పడుతూ గెంతులు వేస్తారో తాను కూడా డ్యాన్స్ చేస్తే అలాగే ఉంటుంది అని గీత తెలిపారు.తాను స్టార్ హీరోయిన్( Star heroine ) అవ్వలేదు అనే భాద తనికెప్పుడు లేదని, వచ్చిన దాంట్లో తృప్తిగా ఉన్నన్ని ఆవిడా తెలపడం విశేషం.
ఇక గీత తెలుగు లో చివరి సారి వెంకీ మామ( Venky mama ) చిత్రంలో కనిపించగా, తమిళ నటి అయ్యి ఉంది ఆమె చాల ఏళ్లుగా తమిళ సినిమాల్లో కనిపించలేదు.కొన్నేళ్ల క్రితం గుప్పెడంత మనసు అనే సీరియల్ లో కూడా నటించారు గీత.ఇక తెలుగు రియాలిటీ షో అయినా బ్రతుకు జట్కా బండి లో కూడా హోస్ట్ గా పని చేసారు.ఇకపై మంచి అవకాశాలు వస్తే తెలుగు లో మరిన్ని సినిమాల్లో నటించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధం అంటున్నారు నటి గీత.