వాలంటీర్ల కు కోతలు మొదలు... ఆ విధులు వీరికి అప్పగింత  

కొత్తగా ఏర్పడిన టిడిపి , జనసేన, బిజెపి ( TDP, Janasena, BJP )కూటమి ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ విషయంలో కీలక నిర్ణయాలే తీసుకుంటోంది .ఎన్నికల కు ముందు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు వ్యవస్థను కొనసాగిస్తామని, నెలకు 10,000 గౌరవ వేతనం ఇస్తామని ప్రకటించారు.

 Those Tasks Are Assigned To The Volunteers Starting From Cuts, Ap Government, Ap-TeluguStop.com

ఇక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటరీ వ్యవస్థలో మార్పుల చేపట్టేందుకు సిద్ధమయ్యారు.వాలంటీర్ గా పనిచేసేందుకు డిగ్రీ అర్హతగా నిర్ణయించారు.

తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.ప్రతి నెల లబ్ధిదారులకు ఇంటి వద్దకే పెన్షన్ మొత్తాన్ని వాలంటీర్లు అందించేవారు.

అయితే ఇప్పుడు ఆ విధుల నుంచి వాలంటీర్లను తప్పించారు.

Telugu Ap, Ap Volanteers, Chandrababu, Janasena, Pavan Kalyan, Volanteers, Volan

ఈ బాధ్యతలను గ్రామ , వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు.జూలై 1వ తేదీ నుంచి ఈ మార్పు అమల్లోకి రాబోతోంది .తాజాగా వాలంటీర్ల ( volunteers )కు ప్రతినెల చెల్లించే 200 రూపాయల న్యూస్ పేపర్ అలివేన్స్ ను తాజాగా రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  తక్షణమే ఈ ఉత్తర్వులు అమలులోకి వచ్చేలా చర్యలు మొదలుపెట్టింది.  జులై ఒకటో తేదీ నుంచి వాలంటీర్లకు చెల్లించే గౌరవ వేతనంతో అదనంగా చేస్తున్న 200 రూపాయల న్యూస్ పేపర్ అలవెన్ ను రద్దు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

దీనికి సంబంధించిన ఉత్తర్వులను గ్రామ , వార్డు , వాలంటీర్లు సచివాలయ విభాగం డైరెక్టర్ ఎం శివప్రసాద్ ( Director M Sivaprasad )ఉత్తర్వులు జారీ చేశారు.

Telugu Ap, Ap Volanteers, Chandrababu, Janasena, Pavan Kalyan, Volanteers, Volan

ప్రభుత్వం ఆమోదించిన జూన్ నెల గౌరవ వేతనం నుంచి 200 రూపాయలను తీసివేయాలని శివప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.ఇంకా ముందు ముందు వాలంటీర్ల విధుల విషయంలో సమూల మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.  పెద్ద ఎత్తున వాలంటీర్లను తప్పించేందుకు ఇప్పటికే ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

వాలంటీర్లకు డిగ్రీ అర్హతగా నిర్ణయించడం తో చాలామంది ప్రస్తుత వాలంటీర్లు అనర్హులు కాబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube