ఒకే ఏడాది లో ఆరు ప్రమాదాలు... జయలలిత జీవితంలో మరిచిపోలేని సంఘటనలు

అప్పట్లో టెక్నాలజీ ఇంతలా లేదు.హీరో హీరోయిన్స్ చాలా రిస్క్ చేసి ఫైట్స్, డ్యాన్స్ చేసేవాళ్ళు.

 Accidents Of Actress Jayalalitha ,gopaludu Bhoopaludu , Actress Jayalalitha, Ko-TeluguStop.com

ప్రేక్షకులను ఒప్పించడానికి ఎంతటి కష్టమైనా సరే రిస్కు తీసుకొని మరి చేసేవారు.అలా చేస్తేనే షార్ట్స్ అద్భుతంగా వస్తాయి.

అందుకు ఎలాంటి జంకు లేకుండా ప్రయత్నించేవారు.అలా ఒక్క ఏడాదిలోనే దాదాపు అయిదారు సార్లు ప్రమాదానికి గురయ్యారట నటి జయలలిత.

అందుకు సంబంధించిన వివరాలను అప్పట్లో ఆమె ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు.అది 1967 వ సంవత్సరం.

కొత్త సంవత్సరం రోజే ఆమె గోపాలుడు భూపాలుడు( Gopaludu Bhoopaludu ) అనే సినిమాలోని వీధినాట్యం చేసే ఒక సన్నివేశం లో డ్యాన్స్ చేయాలి.అందులో ఆమె బాగా చేస్తుంది అనే ఒక పేరు కూడా ఉంది.

అందుకోసం ఒళ్ళు తెలియకుండా డాన్స్ చేస్తూనే ఉండగా, ఉన్నట్టుండి కాలు పట్టుకొని కుప్పకూలిపోయింది.దాంతో 20 రోజుల పాటు బెడ్ కే పరిమితం అవ్వాల్సి వచ్చింది.

Telugu Bollywood, Izzat, Kollywood, Tollywod-Telugu Top Posts

ఆ తర్వాత ఫిబ్రవరిలో నాన్ మరియు సూడివిట్టు మాప్పిళ్లై సినిమాల షూటింగ్ నిమిత్తం ఊటీ వెళ్ళింది.నాన్ సినిమా కోసం ఒక జలపాతం దగ్గర షూట్ చేయాల్సిన అవసరం ఉంది.అక్కడ చాలామంది దూరం నుంచి షూట్ చేసుకుంటారట.నీళ్లలోకి దిగితే వేగంగా ప్రవహించే నీటి దాటికి కొట్టుకపోతారట.అందుకే ఎవరిని నీటిలోకి పంపించారట.కానీ అక్కడ ఉన్న ఒక రాయిపై మైమరచిపోయి డాన్స్ చేస్తున్న జయలలిత ఉన్నటువంటి జారీ పడిపోయారు.

అక్కడ ఉన్న అసిస్టెంట్ కాపాడి బయటకు లాగారు.దాంతో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు.

ఇక సూడివిట్టు మాప్పిళ్లై షూటింగ్ కోసం ఉదకమండలం దగ్గరలో ఒక టీ ఎస్టేట్ లో షూట్ చేయగా పాట సన్నివేషన్లో దూరం నుంచి పరిగెత్తుకు రావాల్సి ఉంది.కానీ ఎత్తు పల్లాలుగా ఉన్న ఆ ఎస్టేట్ లో కాలు ఒక గోతిలో ఇరుక్కుపోయింది.

దాంతో మళ్లీ పది రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది.

Telugu Bollywood, Izzat, Kollywood, Tollywod-Telugu Top Posts

ఇక మే నెలలో ఇజ్జత్( Izzat ) అనే ఒక సినిమా షూటింగ్ కోసం కులు లోయకు వెళ్లాల్సి వచ్చింది జయలలిత.అక్కడ షూట్ చేసిన ప్రదేశంలో చాలామంది ఉన్నాయట ప్రతిరోజు పదికి పైగా ముల్లులు ఆమె కాళ్ళలో గుచ్చుకునేవట.షూటింగ్ నుంచి ఇంటికి వచ్చాక ప్రతిరోజు తన అమ్మ కాలి ముల్లులు తీస్తూనే ఉండేవారట.

అయినా కూడా షూటింగ్ అయిపోయేసరికి కాలలో అనేక ముల్లులు ఇరుక్కుని ఉన్నాయట.డాక్టర్ కొన్ని ముళ్ళు తీసేసిన మరికొన్ని చాలా రోజుల తర్వాత తీయాల్సి వచ్చిందట.ఇక కాలులోనే ఒక ముళ్ళు ఇరుక్కుపోయి ఉండిందట.డాక్టర్ కూడా దాన్ని తీయలేకపోయారట.

ఎన్టీఆర్ సినిమాలో ఒక పాట సన్నివేశంలో డాన్స్ చేస్తుండగా పొరపాటున ఆయన జయలలిత కాలు తొక్కడంతో అప్పటి వరకు కాలులో ఉన్న ముళ్ళు కాస్త బయటకు వచ్చిందట.గాయమైనా కూడా ఆ ముళ్ళు బయటకు వచ్చినందుకు జయలలిత సంతోషపడ్డారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube