రాజన్న సిరిసిల్ల జిల్లా: అంగన్ వాడీ కేంద్రాలలో( Angan Wadi Centres ) సరిగా వసతులు లేని సెంటర్ లలో అంగన్ వాడీ టీచర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానిక మాజీ ఎంపీటీసీ,కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ అడిగి తెలుసుకున్నారు.ఇందులో భాగంగా కిషన్ దాస్ పేట లో గల కవిత అనే అంగన్ వాడీ టీచర్ కు సొంత అంగన్ వాడీ భవనం లేదని,సునిత అనే అంగన్ వాడీ టీచర్ కు సంబంధించిన అంగన్ వాడీ కేంద్రం నిర్మాణ దశలో ఉందని,ఇంకా ఎలక్రికల్ వర్క్ పెండింగ్ లో ఉందని చెప్పగా కాంట్రాక్టర్ తో మాట్లాడి పూర్తి చేస్తానని అన్నారు.
కృష్ణ వేణి అనే టీచర్ కు అంగన్ వాడీ కి సంబంధించి స్వంత భవనం ఉన్నప్పటికీ కరెంట్ కనెక్షన్ లేదని చెప్పగా విద్యుత్ మీటర్ ఇప్పిస్తానని చెప్పడం జరిగింది.అలాగే పాత గ్రంధాలయం నుండీ ఆంగన్ వాడీ కేంద్రం వరకు సీసీ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తానని అన్నారు.
బాల్ నరసమ్మ కు సంబంధించిన అంగన్ వాడీ కేంద్రం మొదటి బై పాస్ లో నిర్మాణం పూర్తి అయ్యిందని ఎలక్ట్రికల్ పనులు పూర్తి కాలేదని సదరు కాంట్రాక్టర్ కు చెప్పి ఇట్టి పనులు పూర్తి చేయిస్తానని బాలరాజు యాదవ్ అన్నారు.నేవూరి నర్మద, మల్లారపు అరుణ లకు సంబంధించి ఎల్లారెడ్డి పేటలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు అంగన్ వాడీ కేంద్రాలు నిర్మాణం పూర్తి అయ్యింది.
కానీ మూత్రశాలలు నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో ప్రస్తుతం గ్రామ పంచాయతీ పక్కన గల మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు అంగన్ వాడీ కేంద్రాల నిర్వహణ జరుగుతుందని త్వరలోనే మన పెద్ద బడి లో పూర్తి అయి ఉందని రెండు మూత్రశాలల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ను కోరుతానని ఒగ్గు బాలరాజు యాదవ్ అన్నారు.సులోచన అనే అంగన్ వాడీ టీచర్ కు సంబంధించి అంగన్ వాడీ కేంద్రంలో మూత్రశాలల తలుపులు సరిగా లేవని సెంటర్లో ఉన్న తరగతి గదులలో ఉన్న ఫ్లోరింగ్ రిపేర్ చేయించాలని చెప్పగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని అన్నారు.
బాల్ నరసమ్మ అనే అంగన్ వాడీ టీచర్ కు సంబంధించి సొంత భవనం నిర్మాణంలో ఉందని అందులో ఎలక్ట్రికల్ పని పూర్తి చేయిస్తానని బాలరాజు యాదవ్ అన్నారు.మూత్ర శాలల నిర్మాణం లేక ఎంపిపీఎస్ పాఠశాలలో కొనసాగుతున్న అంగన్ వాడీ కేంద్రం లకు మూత్రశాలలు నిర్మింపజేసి ఈ రెండు అంగన్ వాడీ కేంద్రం లను స్వంత భవనంలోకి తరలించాలని అన్నారు.
ఈ ప్రభుత్వ పాఠశాలను గ్రామ మహిళ సంఘాల కార్యక్రమాల కోసం గ్రామ మహిళా సమైక్య భవన్ కోసం వినియోగించుకునేలా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతానని ఒగ్గు బాలరాజు యాదవ్( Oggu Balraj yadav ) అన్నారు.ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు బుచ్చి లింగు సంతోష్ గౌడ్, పెద్దమ్మల నర్సింలు, పుల్లయ్య గారి తిరుపతి గౌడ్,నాగుల విక్రం గౌడ్ అన్నారు.