సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Deputy CM Pawan Kalyan ) విజయవాడ క్యాంప్ కార్యాలయంలో బిజీ బిజీగా గడిపారు.ఉదయం క్యాబినెట్ సమావేశంలో పాల్గొనడం జరిగింది.
అనంతరం టాలీవుడ్ నిర్మాతలతో సమావేశమయ్యారు.సాయంత్రం హోంమంత్రి విజయవాడ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం కావడం జరిగింది.
ఆ తర్వాత విజయవాడ క్యాంప్ ఆఫీసు నుండి మంగళగిరి పార్టీ ఆఫీస్ కి వెళ్తున్న సమయంలో సినీ కార్మికులు.పవన్ ని కలవడం జరిగింది.
క్యాంపు కార్యాలయం గేటు దగ్గర కార్మికులను చూసి కాన్వాయ్ ఆపి వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ క్రమంలో సినీ కార్మికులు తమ వినతి పత్రాలు పవన్ కళ్యాణ్ కి అందించడం జరిగింది.డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం వరుస పెట్టి సమావేశాలు నిర్వహిస్తున్నారు.తెలుగు చలనచిత్రా రంగానికి సంబంధించి అగ్ర హీరో డిప్యూటీ సీఎం కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
తమ కష్టాలు బాధలపై అవగాహన ఉన్న వ్యక్తి పదవిలో ఉన్నారని.సినిమా ఇండస్ట్రీ కష్టాలు తగ్గుతాయని భావిస్తున్నారు.సోమవారం డిప్యూటీ క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ని కలసిన నిర్మాతలు ఎమ్మెల్యే అయినందుకు డిప్యూటీ సీఎం ( Deputy CM )పదవి చేపట్టినందుకు అభినందించారు.మంత్రిగా కూడా విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.