ఎలాంటివారు రక్తాన్ని దానం చేయకూడదు?

మీ జీవితంలోని ఓ అరగంట మీది కాదు అనుకోని రక్తదానం కోసం కేటాయిస్తే చాలు, ఓ నిండు ప్రాణాన్ని కాపాడిన వారు అవుతారు.రక్తదానం వలన మీరు కోల్పోయేది ఏమి ఉండదు.

 Know Who Cannot Do Blood Donation Details, Blood Donatiion, Telugu Health Tips,-TeluguStop.com

దానం చేసిన రక్తం ఎలాగో మళ్ళీ పుట్టేస్తుంది.మంచి బరువు, ఆరోగ్యంగా ఉన్న ఏ మనిషి అయిన రక్తాన్ని దానం చేయవచ్చు అని మీకు తెలుసు.

కాని రక్తం దానం ఎవరు చేయకూడదో, ఎలాంటి పరిస్థితుల్లో చేయకూడదో మీకు తెలుసా? తెలుసుకోండి.

* జ్వరం, ఇంకేదైనా ఇన్ఫెక్షన్ ఉన్నవారు రక్తాన్ని అప్పుడే డొనేట్ చేయకూడదు.

ఇక జాండిస్, హెపటైటిస్ లాంటివి చూసిన వారు ఓ ఏడాది కాలంపాటు తమ రక్తాన్ని ఇవ్వకపోవడమే మంచిది.

* మీకు కాదు, ఒకవేళ మీ భాగస్వామికి బ్లడ్ క్లాటింగ్ సమస్యలు ఉండి, వారితో శృంగారం గనుక చేసినట్లయితే, కనీసం ఓ సంవత్సరం పాటు వారితో శృంగారం చేయకుండా గడిపితేనే రక్తాన్ని దానం చేయవచ్చు.

* టాటూ వేయిన్చుకున్నవారు, కాస్మోటిక్ సర్జరీలు చేయించుకున్నవారు, నీడిల్స్ ఉపయోగించి పెర్మనెంట్ ట్రీట్ మెంట్ చేయించుకున్నవారు ఓ నాలుగు నెలల పాటు రక్తాన్ని దానం చేయకూడదు.టాటూ రకరకాల పద్ధతులలో వేస్తారు.

నీడిల్స్ తో వేయించుకుంటే మాత్రం కొన్ని నెలలు ఆగండి.

Telugu Count, Heart Problems, Telugu Tips-Telugu Health - తెలుగు హ

* స్వలింగ సంపర్కులు కూడా రక్తాన్ని దాన్యం చేయకపోవడమే మంచిది.అలాగే స్వలింగ సంపర్కులతో శృంగారించిన స్ట్రెయిట్ పురుషులు/మహిళలు ఏడాది పాటు రక్తాన్ని ఇవ్వకూడదు.

* కొన్నిరకాల మేడిసిన్స్, ఉదాహరణకి ఐసో ట్రయిన్ లాంటివి వాడుతున్నవారు, యాంటి బయోటిక్స్ ఎక్కువ వాడేవారు ఆ మందులు మానేసిన 4-6 నెలల వరకు రక్తాన్ని ఇవ్వకూడదు.

* HIV/HPV ఇంకెలాంటి సుఖవ్యాధులు ఉన్నా, వారు రక్తాన్ని ఇవ్వకూడదు.వారు మరొకరితో శృంగారిస్తేనే ప్రమాదం, అలాంటిది రక్తం ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం.

Telugu Count, Heart Problems, Telugu Tips-Telugu Health - తెలుగు హ

* హిమోగ్లోబిన్ కౌంట్ 13.0 g/dL కంటే తక్కువ ఉన్న పురుషులు, 12.5 g/dL కంటే తక్కువ ఉన్న స్త్రీలు రక్తాన్ని ఇవ్వకూడదు.అలాగే పురుషులైనా, స్త్రీలైనా, హిమోగ్లోబిన్ 20.0 g/dL కంటే ఎక్కువ ఉంటే రక్తాన్ని ఇవ్వకూడదు.

* గుండె సంబధిత సమస్యలు ఏవి ఉన్నా, రక్తాన్ని ఇవ్వకూడదు.

సమస్యకి చికిత్స జరిగిన ఆరునెలల దాకా అయినా ఇలాంటి వారు ఆగాల్సిందే.

* ఇక చివరగా, సింపుల్ పాయింట్.16 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు రక్తాన్ని ఇవ్వకూడదు.అలాగే అండర్ వెయిట్ ఉన్నవారు కూడా రక్తదానానికి దూరంగా ఉంటేనే మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube