ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, హార్మోన్ చేంజ్, నిత్యం తల స్నానం చేయడం, రసాయనాలతో కూడిన షాంపూలను వినియోగించడం, పలు రకాల మందుల వాడకం, పోషకాల లోకం తదితర కారణాల వల్ల చాలా మంది తీవ్రమైన హెయిర్ ఫాల్ సమస్యను ఎదుర్కొంటున్నారు.అధికంగా ఊడిపోవడం వల్ల జుట్టు రోజురోజుకు పల్చగా మారుతుంటుంది.
దాంతో ఏం చేయాలో తెలియక.జుట్టు రాలడాన్ని ఎలా అడ్డుకోవాలో అర్థం కాక మదన పడుతుంటారు.
కానీ వర్రీ వద్దు.ఉసిరి పొడి( Amla powder ) ఉంటే చాలు చాలా సులభంగా హెయిర్ ఫాల్ సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు.
ఉసిరిలో విటమిన్ సి, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్( Vitamin C, Iron, Calcium, Phosphorus ) వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అద్భుతంగా సహాయపడుతుంది.
అదే సమయంలో జుట్టు రాలడాన్ని చాలా త్వరగా అదుపులోకి తెస్తాయి.అయితే మరి ఉసిరి పొడిని ఎలా వాడితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా స్టవ్ ఆన్ చేసి ఐరన్ కడాయి పెట్టుకుని అందులో ఒక చిన్న కప్పు కొబ్బరి నూనె( coconut oil ) మరియు ఒక చిన్న కప్పు నువ్వుల నూనె( Sesame oil ) వేసుకోవాలి.
ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఉసిరి పొడిని వేసుకుని దాదాపు పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ లో చల్లార బెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్ లో నింపుకోవాలి.
ఈ ఆయిల్ దాదాపు ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది.
వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.మీరు రెగ్యులర్గా వాడే ఆయిల్ మాదిరిగానే ఈ ఆయిల్ ను కూడా వాడొచ్చు లేదా ఆయిల్ అప్లై చేసుకున్న మరుసటి రోజు హెయిర్ వాష్ చేసుకోవచ్చు.ఈ ఆమ్లా ఆయిల్ హెయిర్ ఫాల్ సమస్యకు శాశ్వతంగా గుడ్ బై చెప్పడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది.
పైగా ఈ ఆయిల్ ను వాడటం వల్ల తెల్ల జుట్టు సమస్య దరిచేరకుండా ఉంటుంది.కురులు నల్లగా నిగనిగలాడుతూ కనిపిస్తాయి.