కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు సంచలన వార్నింగ్..!!

ఎన్నికలలో గెలిచిన అనంతరం తొలిసారి సొంత నియోజకవర్గం కుప్పంలో మంగళవారం సీఎం చంద్రబాబు( CM Chandrababu ) పర్యటించారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ మెమోరియల్ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.

 Cm Chandrababu Sensational Warning During Kuppam Visit Cm Chandrababu, Kuppam ,-TeluguStop.com

రాబోయే రోజుల్లో కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత తనదని స్పష్టం చేశారు.అంతేకాకుండా కుప్పంలో అసాంఘిక శక్తులను ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.కుప్పంలో రౌడీయిజానికి స్థానం లేదని స్పష్టం చేశారు.1989లో మొట్టమొదటిసారి కుప్పం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశానని పేర్కొన్నారు.ఆ సమయంలో పలమనేరు నుంచి కుప్పం( Kuppam )కు నేరుగా రోడ్డు ఉండేది.అది కేవలం సింగిల్ రోడ్డు.నాడు టెలిఫోన్ లు లేవు, కాలేజీలు లేవు.చిత్తూరు జిల్లాలో కుప్పం వెనకబడిన ప్రాంతం.

అప్పుడే నిర్ణయించుకున్నాను.కుప్పం నుంచే పని చేయాలని.

అందువల్లే ఈ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నాను.కుప్పంలో జరిగిన ప్రతి అభివృద్ధి వెనకాల తెలుగుదేశం పార్టీ ఉంది.

Telugu Ap, Cm Chandrababu, Kuppam, Ys Jagan-Latest News - Telugu

ఈ అభివృద్ధి పనులను మీ ఎమ్మెల్యేగా నేనే చేశానని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను.2019 నుంచి 2024 వరకు సాగిన పాలనను నా జీవితంలో ఏనాడు చూడలేదు.అదొక పీడకల వంటిది.అరాచకం, అప్రజాస్వామ్యం, దౌర్జన్యాలు.రౌడీయిజంతో రెచ్చిపోయారు.నా జోలికి వచ్చారంటే పరిస్థితి ఎలా తయారయ్యిందో చూడండి.

ఎక్కడో కేజీఎఫ్ అనుకుంటే అక్కడ బంగారం గనులు వచ్చాయి.కానీ కేజీఎఫ్( KGF ) ను మరిపించేలా కుప్పంలో గ్రానైట్ దోపిడీ జరిగింది.

అప్పుడు నేను మాజీ ముఖ్యమంత్రిగా విపక్షనేతగా ఎమ్మెల్యేగా ఉన్నాను.నాకే దిక్కులేదు నాడు నేను కుప్పంకు వస్తుంటే జీవో నెంబర్ వన్ తీసుకొచ్చారు.

మన పైనే దాడులు చేసి మన వాళ్ల మీదనే కేసులు పెట్టారు.ఇవన్నీ నేను మర్చిపోతానా.? అంటూ సంచలన కామెంట్లు చేశారు.రాబోయే ఐదేళ్లుకు సంబంధించి స్పష్టమైన ప్రణాళిక ఉంది.

సంక్షేమానికి పెద్దపీట వేసి అభివృద్ధిని పరిగెత్తిస్తాం.కుప్పం మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా చేస్తాం.

అందుకు ఎంత ఖర్చైనా నిధులు మంజూరు అయ్యేలా చూస్తానని సీఎం చంద్రబాబు సంచలన స్పీచ్ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube