పురుషులు వారానికి ఒక్కసారి ఇలా చేస్తే బట్టతల కి దూరంగా ఉండవచ్చు!

ఇటీవల రోజుల్లో చాలా మంది పురుషులను కలవర పెడుతున్న సమస్య బట్టతల.( Bald Head ) వర్క్ స్ట్రెస్, మద్యపానం, ధూమపానం, బిజీ లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, మొబైల్ ఫోన్ ను అధికంగా వినియోగించడం తదితర కారణాల వల్ల జుట్టు రాలిపోతూ ఉంటుంది.ఇది క్రమంగా బట్టతలకు దారితీస్తుంది.అయితే వయసు పైబడిన తర్వాత బట్టతల వచ్చిన పెద్దగా బాధపడరు.కానీ పెళ్లికి ముందే బట్టతల వచ్చింది అంటే ఇక వారి బాధను వ‌ర్ణించ‌లేము.ఎందుకంటే ఈ రోజుల్లో ఎంత పెద్ద జాబ్‌ ఉన్నప్పటికీ బట్టతల ఉంటే మాత్రం అబ్బాయిలకు పెళ్లి కావడం లేదు.

 If Men Follow This Remedy Once A Week They Will Not Get Baldness Details! Baldne-TeluguStop.com

అందుకే బట్టతల అంటేనే భయపడుతుంటారు.అయితే బట్టతల వచ్చాక బాధపడటం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా పురుషులు వారానికి ఒక్కసారి ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే బట్టతల మీ దరిదాపుల్లోకి కూడా రాదు.మరి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

రెండు అంగుళాల అల్లం ముక్కను( Ginger ) తీసుకుని శుభ్రంగా పొట్టు తొల‌గించి సన్నగా తురుముకోవాలి.

Telugu Baldness, Oil, Coconut Oil, Ginger, Care, Care Tips, Remedy, Thick-Telugu

ఈ తురుము నుంచి జ్యూస్ ను సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో అల్లం జ్యూస్ ను వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆముదం,( Castor Oil ) వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, ( Coconut Oil ) హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేంతవరకు స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Baldness, Oil, Coconut Oil, Ginger, Care, Care Tips, Remedy, Thick-Telugu

ఇప్పుడు దీన్ని ఒక స్ప్రే బాటిల్ లో నింపుకొని.స్కాల్ప్ కు ఒకటికి రెండు సార్లు స్ప్రే చేసుకోవాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే అల్లం, ఆముదం, కొబ్బరి నూనె మరియు విటమిన్ ఈ ఆయిల్ లో ఉండే పలు సుగుణాలు జుట్టు రాలడాన్ని అడ్డుకుని ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.

బట్టతల వచ్చే రిస్క్ ను చాలా వరకు తగ్గిస్తాయి.కుదుళ్ళను బలోపేతం చేస్తాయి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube